BigTV English

YCP leader Arrested: వైసీపీకి మరిన్ని చిక్కులు.. బోరుగడ్డ అనిల్‌ అరెస్ట్, గుట్టు బయటపెట్టేనా?

YCP leader Arrested: వైసీపీకి మరిన్ని చిక్కులు.. బోరుగడ్డ అనిల్‌ అరెస్ట్, గుట్టు బయటపెట్టేనా?

YCP leader Arrested: ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు రెచ్చిపోయిన నేతలంతా ఇప్పుడు జైలు బాట పడుతున్నారా? సైలెంట్‌గా చంద్రబాబు సర్కార్ తన పని తాను చేసుకు‌పోతుందా? వైసీపీ నేతల్లో భయం మొదలైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


పైన కనిపిస్తున్న వ్యక్తి.. వైసీపీ నేత పేరు బోరుగడ్డ అని‌ల్‌కుమార్. వైసీపీ హయాంలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మొదలు వ్యాపారవేత్తలు, సామాన్యుల వరకు ఆయన చేసిన ఆగడాలు అన్నీఇన్నీ కావు.

సింపుల్‌గా చెప్పాలంటే తనదే రాజ్యం అన్నట్లుగా రెచ్చిపోయాడు.. చాలామంది దూషించాడు కూడా. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బుధవారం రాత్రి నల్లపాడు వద్ద గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని రహస్యంగా విచారిస్తున్నారు.


తొలుత చంద్రబాబు సర్కార్‌లో తనను తాను రిపబ్లిక్ పార్టీ నేతగా పరిచయం చేయకున్నాడు అనిల్‌కుమార్. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక లోపల వ్యక్తిని బయటపెట్టాడు. ఎన్నికల ప్రచారం అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేత.

కాలం ఎప్పుడూ ఒకలా ఉంటుందని భావించాడు అనిల్‌కుమార్. కానీ సీన్ రివర్స్ అయ్యింది.. అప్పటి సీఎం జగన్ మాటలను బలంగా నమ్మాడు. ఇలాంటి వైసీపీ నేతలకు ఇప్పుడు భయం పట్టుకుంది. ఏ సమయంలో పోలీసులు తమను అరెస్ట్ చేస్తారేమోనని బెంబేలెత్తుతున్నారు.

జగన్‌కు సన్నిహితుడిగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకునేవాడు అనిల్ కుమార్. తన అనుచరులతో కలిసి రోడ్లపై నానా హంగామా చేసేవాడు. ఓ ఇంటర్వ్యూలో అయితే చంద్రబాబు గురించి మరింత దారుణంగా మాట్లాడాడు.

ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ చేసి మరీ బెదిరించేవాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లపై చేయి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. వైసీపీ నేతలతో క్లోజ్ గా ఉండడంతో పోలీసులు అనిల్ వైపు చూసేవారు కాదు.

అనిల్ మాదిరిగానే వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన నోటికి పని చెప్పారు. స్పీకర్ ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై దారుణమైన కామెంట్స్ చేశారు. బ్లాక్ కమాండోస్ లేకపోతే చంద్రబాబు ఫినిష్ అంటూ తన నోటి దురుసు బయటపెట్టుకున్నారు. ఇప్పుడు ఆయా నేతలు హడలిపోతున్నారు.

 

 

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×