E-Paper
Advertisement

Tirumala Darshan Tickets : తిరుమల భక్తులకు ఆఫ్ లైన్ లో టికెట్లు

Tirumala Darshan Tickets : తిరుమల భక్తులకు ఆఫ్ లైన్ లో టికెట్లు
Advertisement

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం  శుభవార్త తెలిపింది.  శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతి లో మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. గుంటూరుకు చెందిన ఎన్ లక్ష్మి హరీశ్‌, జి.రూప సింధుకు తొలి టికెట్ అందజేశారు. శ్రీవాణి ట్రస్టు కు రూ 10 వేలు విరాళం ఇచ్చి రూ 500 చెల్లించే భక్తులకు ఇప్పటి దాకా తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తున్నారు..టీటీడీ మాధవం విశ్రాంతి భవనంలో ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు కౌంటర్‌ ఓపెన్ చేయనున్నారు

శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ, కొత్తగా ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు కు విరాళం ఇచ్చే భక్తులు తిరుపతిలోని మాధవం అతిథిగృహం లో ఏర్పాటు చేసిన కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలి. శ్రీవాణి ట్రస్ట్‌ దాతలకు తిరుపతిలో ఆఫ్‌లైన్ టికెట్లు, గదులను మంజూరు చేయనున్నట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు. ముందుగా నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా టీటీడీ అమలు చేయనుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మీదట పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురానుంది.

Advertisement

దాతలు ముందురోజు తిరుమలకు వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రక్రియలో దాతల ఇబ్బందులు గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి ఇక్కడే వారికి వసతి గదులు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కు సమీపంలో ఉన్న మాధవం గెస్ట్ హౌస్ నుంచి ఉదయాన్నే బయలు దేరి తిరుమలకు  చేరుకోవచ్చన్నారు.

Tags

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×