E-Paper
Advertisement

PM Kisan: పీఎం కిసాన్ కొందరికేనా?

PM Kisan: పీఎం కిసాన్ కొందరికేనా?
Advertisement

PM Kisan: పేద రైతులకు పంటసాయం అందించాలనే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన పథకం ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’. అయితే, నేటికీ అర్హులైన అనేకమంది రైతులకు ఈ పథకం ద్వారా నిధులు అందడం లేదు.

ఈ పథక రూపకల్పన సమయంలో 2018 కంటే ముందు పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులను మాత్రమే అర్హులుగా పరిగణించి సాయం అందించటం మొదలుపెట్టారు. 2019 ఫిబ్రవరి ఆ తర్వాత నమోదైనవారికి ఆ పథకం కింద ఎన్‌రోల్ చేయించుకున్న వారికి సాయం అందటం లేదు. పైగా, రకరకాల నిబంధనల పేరిట కొర్రీలు పెడుతూ కేంద్రం ఏటా పాత లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది.

Advertisement

అలాగే తల్లిదండ్రులు చనిపోతే.. వారి భూమిని పొందిన వారసులకు, కొత్తగా భూమి కొన్నవారికి, విరాసత్ ద్వారా భూమిని పొందినవారు, ఉమ్మడి కుటుంబ భూమిని పంచుకున్న కుటుంబ సభ్యలకు ఈ పథకం అందటం లేదు. తెలంగాణలో సుమారు 10 లక్షల ఇలాంటి లబ్దిదారులు పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.

2018 డిసెంబర్‌లో ఈ స్కీమ్ వచ్చినప్పుడు తెలంగాణలో 20,09,462 మంది లబ్దిదారులుండగా, వారికి రూ.405 కోట్ల నిధులు జమ అయ్యాయి. 2019-20 నాటికి ఈ సంఖ్య 34,73,883 చేరగా రూ.2,121 కోట్లు అందాయి. 2020 – 21 ఆర్ధిక సంవత్సరానికి గానూ 36,36,780 మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున మొత్తం మూడు విడతల్లో రూ.2,214 కోట్లు జమ చేసింది.

Advertisement

Also Read: కార్మికుల సొమ్ము దర్జాగా దోపిడీ!

ఆ తర్వాత రైతుల సంఖ్య 35.81 లక్షలకు పడిపోగా, 2024 నాటికి ఇది 30,39,181కి చేరింది. అంటే.. 6 లక్షల మంది పేర్లు వేర్వేరు కారణాలతో జాబితా నుంచి తొలగించారని తెలుస్తోంది. మరోవైపు, రాష్ట్రంలో రైతుబంధు కింద 2018 ఖరీఫ్ సీజన్ లో 50.2 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 70 లక్షలకు చేరింది. ఏటా కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి రైతుబంధు అందుతోండగా, పీఎం కిసాన్ విషయంలో అప్‌డేట్ చేయటం ఆపేసి, రైతుల సంఖ్యను తగ్గిస్తున్నారు.

నిపై రాష్ట్ర యంత్రాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అలాగే, ఏటా వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నందున ఈ బడ్జెట్‌లోనైనా ఏడాదికి రూ.6000గా ఉన్న సాయాన్ని రూ.10 వేలకు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

Big Stories

Advertisement
×