E-Paper
Advertisement

Pushpa 2: ఆ రీజన్ వల్ల..శరవేగంగా జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కు సడన్ బ్రేక్..

Pushpa 2: ఆ రీజన్ వల్ల..శరవేగంగా జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కు సడన్ బ్రేక్..
Advertisement

Pushpa 2: టాలీవుడ్ ఫిలిం రేంజ్ ని విపరీతంగా పెంచిన మూవీ పుష్ప. ఈ మూవీలో సాంగ్స్ కి మన సెలబ్రిటీలే కాదు ఆఖరికి విదేశాల్లో సెలబ్రిటీలు కూడా డాన్సులు వేసి వీడియోలను వైరల్ చేశారు. పుష్ప సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఎటువంటి అంచనాలు లేకుండా ఎంతో సైలెంట్ గా వచ్చినా ఈ మూవీ తెలుగులోనే కాకుండా హిందీ బాక్స్ ఆఫీస్ని కూడా బంతాటాడేసింది. దీంతో టాలీవుడ్ బాలీవుడ్ లో సూపర్ ఫేమస్ అయిపోయింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందాన్నా కాంబోలో సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎటు చూసినా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో అల్లు అర్జున్ మాస్ లుక్ మరియు డిఫరెంట్ స్టైల్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఎర్రచందనం మాఫియా తో ముడిపడిన ఈ చిత్రం ఒక మామూలు మనిషి మాఫియాని శాసించే వ్యక్తిగా ఎలా మారుతాడు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.

Advertisement

ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి వేర్ ఇస్ పుష్ప అని వచ్చిన వీడియో, తిరుపతి గంగ జాతర నేపథ్యంలో అల్లు అర్జున్ వింత ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోయే మూవీపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. హలో ఈ చిత్రం విడుదలవుతుంది అని ఆశిస్తున్న అభిమానులను నిరాశపరిచేలా మూవీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వైరల్ అయింది.

ప్రస్తుతానికి పుష్ప 2 షూటింగ్ కి కాస్త చిన్న బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా భారీ రేంజ్ లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ని ప్లాన్ చేస్తున్నాడు మూవీ డైరెక్టర్ సుకుమార్. దీనికోసం ప్రతి ఒక్క సీన్ ని ఎంతో పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దుతున్నారట. అందుకే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. మూవీ కోసం ఎంత రేంజ్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయం మూవీ కి సంబంధించిన పలు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది.

Advertisement

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ,రష్మిక మరికొంతమంది యాక్టర్స్ ఇక్కడ ఒక మెయిన్స్ స్క్రీన్ పై సన్నివేశ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే వచ్చే వారం అల్లు అర్జున్ నేషనల్ అవార్డు ప్రజెంటేషన్ ఈవెంట్ సందర్భంగా కాస్త బిజీగా ఉంటాడు. ఎందుకంటే పుష్ప సినిమాకి బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ గెలుచుకున్నాడు. కాబట్టి రెండు రోజుల పాటు షూటింగ్ కి బ్రేక్ పడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రెస్టేజ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఆగస్టు 15 కి ఎలాగైనా రిలీజ్ అవ్వాలని చిత్త బృందం తెగ తాపత్రయపడుతోంది.

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

Big Stories

Advertisement
×