BigTV English
Advertisement

Threat to Salman Khan: క్లెమోర్ మైన్ పేలినా, బుల్లెట్ల వర్షం కురిసినా.. సల్మాన్ లేటెస్ట్ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిదే!

Threat to Salman Khan: క్లెమోర్ మైన్ పేలినా, బుల్లెట్ల వర్షం కురిసినా.. సల్మాన్ లేటెస్ట్ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిదే!

Salman Khan New Car: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపులు పెద్ద తలనొప్పిగా మారాయి. రీసెంట్ గా ముంబైలో ఎన్సీపీ నాయకుడు సిద్ధిఖీ దారుణ హత్యకు గురికావడం, ఆ మర్డర్ తామే చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడంతో, అందరి ఫోకస్ సల్మాన్ మీద పడింది. ఈ గ్యాంగ్ చాలా ఏండ్లుగా సల్మాన్ ను చంపుతామని హెచ్చరిస్తోంది. తాజాగా బిష్ణోయ్ తో గొడవ ఉండకూడదంటే రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ ముంబై పోలీసులకు ఆగంతకుల నుంచి మెసేజ్ వచ్చింది. ఓవైపు ఈ మెసేజ్ పంపింది ఎవరని దర్యాప్తు చేస్తున్న పోలీసులు, మరోవైపు ఆయనకు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన ఇంటి పరిసరాలకు తెలియని వారిని అనుమతించడం లేదు. మీడియాను కూడా సల్మాన్ ఇంటికి దగ్గరికి రానివ్వడం లేదు.


మరో బుల్లెట్ ఫ్రూఫ్ కారు కొనుగోలు చేసిన సల్మాన్   

ప్రభుత్వం సల్మాన్ కు భద్రత పెంచినప్పటికీ ఆయన మరింత జాగ్రత్తపడుతున్నారు. నిత్యం తాను ప్రయాణించే కారు మరింత సెక్యూర్ గా ఉండాలని భావిస్తున్నారు. గత ఏడాది నిస్సాన్ కంపెనీకి చెందిన బుల్లెట్ ఫ్రూఫ్ కారును కొనుగోలు చేసిన ఆయన, ఇప్పుడు అదే కంపెనీకి చెందిన మరో బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ పెట్రోల్ కారు లేకపోవడంతో గతంలో దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మరో కారును కూడా దుబాయ్ నుంచే దిగుమతి చేసుకుంటున్నారు.


నిస్సాన్ బుల్లెట్ ఫ్రూఫ్ కారు ప్రత్యేకత ఏంటంటే?

సల్మాన్ ఖాన్ కొనుగోలు చేసిన తాజా నిస్సాన్ బుల్లెట్ ఫ్రూఫ్ కారు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. నిజానికి సల్మాన్ దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నా, నిస్సాన్ పెట్రోల్ SUV బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ఎక్కువగా వాడుతారు. ఈ కారు టాప్ టైర్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆయన కొనుగోలు చేసే కారు ధర  సుమారు రూ. 2 కోట్లు ఉంటుంది. ఈ కారు క్లెమోర్ మైన్ పెట్టి పేల్చినా తట్టుకుంటుంది. పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్ల వర్షం కురిపించినా తట్టుకుంటుంది. అత్యధునికి గ్లాస్ షీల్డ్ గట్టి భద్రతను అందిస్తుంది. ఈ కారు ప్రయాణిస్తుంటే, అందులో ఉన్న డ్రైవర్ సహా ఎవరూ బయటకు కనిపించరు.ఈ లేటెస్ట్ SUV పవర్ ఫుట్ 5.6-లీటర్ V8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో పాటు ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది.

60 మందితో సెక్యూరిటీ

అటు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులతో సల్మాన్ ప్రైవేట్ భద్రతను కూడా పెంచుకున్నారు. సుమారు 60 మంది సిబ్బందిని పెట్టుకున్నారు. వారి భద్రత నడుమ తాజా బిగ్ బాస్ షో షూట్ చేసినట్లు తెలుస్తోంది. వరుస బెదిరింపుల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని పోలీసులు సూచించారు. అటు కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: భారత్-కెనడా దౌత్య యుద్ధంలో ‘లారెన్స్ బిష్ణోయ్’, ఇంతకీ ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాగ్రౌండ్ ఏంటి?

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

Big Stories

×