BigTV English

Samantha: గాల్లో తేలుతున్నట్టుంది.. సమంత పోస్ట్ వైరల్..

Samantha: గాల్లో తేలుతున్నట్టుంది.. సమంత పోస్ట్ వైరల్..

Samantha: యశోదతో మరో సూపర్ హిట్ కొట్టారు సమంత. నటన పరంగా అల్లంత ఎత్తుకు చేరారు. సరోగసి నేపథ్యంలో థిల్లర్ మూవీగా వచ్చిన యశోదను ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. స్టార్ హీరోలతో సమానంగా.. హీరోయిన్ గా సూపర్బ్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించారు సమంత. సినిమా అంతా సమంతే. ప్రతీ సీన్ లోనూ ఔరా అనిపించే నటనే. పర్సనల్ గా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమంతకు.. యశోద హిట్ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. లేటెస్ట్ గా యశోదా సక్సెస్ పై సమంత పెట్టిన పోస్ట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ సమంత ఏమన్నారంటే…


ప్రియమైన ప్రేక్షకులకు..
‘యశోద’ పై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.
‘యశోద’ చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉంది.
ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ‘యశోద’ మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్ళకు, ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను.
నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ గారికి కృతజ్ఞతలు.
దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి, ఉన్ని ముకుందన్ గారికి, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పనిచేయడం నాకు ఎంతో ఆనందానిచ్చింది.
సదా వినయపూర్వక కృతజ్ఞతలతో…
మీ
సమంత


Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×