E-Paper
Advertisement

Business Idea For Women: తక్కువ పెట్టుబడి-ఎక్కువ లాభం, ఇంట్టో ఉండే మహిళల కోసం డిజిటల్ బిజినెస్ ప్లాన్స్

Business Idea For Women: తక్కువ పెట్టుబడి-ఎక్కువ లాభం, ఇంట్టో ఉండే మహిళల కోసం డిజిటల్ బిజినెస్ ప్లాన్స్
Advertisement

Business Idea For Women: నేటి డిజిటల్ యుగంలో మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా.. తమ నైపుణ్యాలతో ఆర్థికంగా ఎదుగుతున్నారు. దీనికి కావలసింది పెద్ద ఆఫీసు లేదా భారీ పెట్టుబడి కాదు. కేవలం మీ చేతిలో ఉన్న ఒక స్మార్ట్‌ఫోన్ ,ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. మహిళలు, విద్యార్థినులు లేదా ఖాళీ సమయం ఉన్న ఎవరైనా ఫోన్ ద్వారా నెలకు వేల రూపాయలు సంపాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మహిళల కోసం సులభమైన , లాభదాయకమైన ఆన్‌లైన్ బిజినెస్ ప్లాన్‌లకు సంబంధించిన వివరంగా తెలుసుకుందాం.

1. రీసెల్లింగ్ బిజినెస్: మహిళలకు అత్యంత సులభమైన, ప్రజాదరణ పొందిన మార్గం ఇది. Meesho (మీషో), GlowRoad వంటి యాప్‌లను ఉపయోగించి బట్టలు, జ్యువెలరీ, ఇంటి అలంకరణ వస్తువులను మీరు అమ్మవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఆ ఉత్పత్తుల ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో లేదా ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో షేర్ చేయడం. ఎవరైనా ఆర్డర్ ఇస్తే.. ఆ యాప్ ద్వారా బుక్ చేస్తే చాలు.. డెలివరీ మరియు పేమెంట్ బాధ్యత సంస్థే చూసుకుంటుంది. మీకు మధ్యలో కమిషన్ లభిస్తుంది.

Advertisement

2. కంటెంట్ క్రియేషన్ (YouTube & Instagram): మీకు వంటలు చేయడం, కుట్టు మిషన్, లేదా బ్యూటీ టిప్స్ వంటి వాటి గురించి ఏవైనా నైపుణ్యాలు ఉంటే.. వాటిని వీడియో తీసి YouTube లేదా Instagram Reelsలో పోస్ట్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లోనే వీడియో ఎడిటింగ్ యాప్స్ (Canva, InShot) ఉపయోగించి ప్రొఫెషనల్ వీడియోలు తయారు చేయవచ్చు. ఛానెల్ పాపులర్ అయితే యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా భారీగా సంపాదించవచ్చు.

3. ఆన్‌లైన్ ట్యూషన్లు (Online Tutoring): మీరు చదువుకున్న వారైతే, విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చెప్పవచ్చు. Zoom లేదా Google Meet వంటి యాప్స్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుంచే క్లాసులు నిర్వహించవచ్చు. ముఖ్యంగా గణితం, ఇంగ్లీష్ లేదా కోడింగ్ వంటి సబ్జెక్టులకు మంచి డిమాండ్ ఉంది. కేవలం రోజుకు 2-3 గంటలు కేటాయించి మంచి ఆదాయం పొందవచ్చు.

Advertisement

4. సోషల్ మీడియా మేనేజ్మెంట్: చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ మీడియా హ్యాండిల్స్ (Instagram, Facebook) మెయింటైన్ చేసే వారి కోసం వెతుకుతుంటారు. మీరు వారి తరపున పోస్ట్లు పెట్టడం, కస్టమర్ల కామెంట్లకు రిప్లై ఇవ్వడం వంటి పనులు ఫోన్ నుంచే చేయవచ్చు. దీనికి డిజిటల్ మార్కెటింగ్ మీద కనీస అవగాహన ఉంటే సరిపోతుంది.

5. హ్యాండ్‌మేడ్ ప్రోడక్ట్స్: మీకు పెయింటింగ్, గ్రీటింగ్ కార్డ్స్ తయారీ లేదా ఆర్గానిక్ సోపులు తయారు చేయడం అలవాటు ఉంటే.. వాటిని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోర్ ద్వారా విక్రయించవచ్చు. దీని వల్ల మీ సృజనాత్మకతకు గుర్తింపుతో పాటు ఆదాయం కూడా లభిస్తుంది.

ముఖ్యమైన జాగ్రత్తలు:

వ్యాపారం ప్రారంభించే ముందు మార్కెట్ డిమాండ్‌ను గమనించండి.

సోషల్ మీడియాలో మీ ఉత్పత్తుల గురించి నాణ్యమైన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయండి.

కస్టమర్లతో మర్యాదగా ప్రవర్తించి నమ్మకాన్ని పెంపొందించుకోండి.

స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం వినోదానికే కాదు. అది ఒక శక్తివంతమైన ఆదాయ వనరు కూడా.. మహిళలు తమకున్న ప్రతిభను గుర్తించి.. సరైన ప్లానింగ్‌తో ముందుకు సాగితే ఆన్‌లైన్ వ్యాపారంలో గొప్ప విజయాలు సాధించవచ్చు.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×