E-Paper
Advertisement

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు
Advertisement

Ethanol Gas: పెట్రోల్‌తో ఇథనాల్‌ను మిళితం చేసిన కేంద్రం, ఇప్పుడు మరో అడుగు వేయనుంది. త్వరలో మీ వంటగదికి ఇథనాల్ ఇంధనంగా మారవచ్చు. దీనికి సంబంధించి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే దీనికి సంబంధించిన సమగ్ర విధానం సెప్టెంబరు నాటికి పూర్తి కానుంది.

కేంద్రం కొత్త ఆలోచన-పశ్చిమాసియాలో నాలుగైదు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫలితంగా ఎల్పీజీ దిగుమతులు కేంద్రానికి భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ను ఇంధనంగా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్రప్రభుత్వం.

Advertisement

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్- పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్-E-20 కలిపింది. ప్రస్తుతం 700 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉండడంతో దానిని వంటగదికి మళ్లించాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే సెప్టెంబరు నాటికి సమగ్ర విధానం రెడీ కానుంది.

ఇథనాల్‌తో వంటలు కుకింగ్-ఇథనాల్‌కు ప్రస్తుతమున్న గ్యాస్ స్టవ్ ఉపయోగించవచ్చా? అన్నదే అసలు ప్రశ్న. ఇథనాల్ వినియోగానికి గ్యాస్ స్టవ్‌లు పనికి రావని అంటున్నారు. అందుకోసం సూపర్ బ్లూ స్టవ్ అనే పరికరం అవసరం కానుంది. లీటరు ఇథనాల్‌తో సుమారు 15 గంటలు వంట చేసుకోవచ్చు. ఎల్పీజీ కంటే చౌకగా లభిస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇదివరకే వెల్లడించారు.

Advertisement

సెప్టెంబర్ నాటికి కొలిక్కి వచ్చే ఛాన్స్-ఎల్పీజీ తరహాలో స్టవ్‌లు, ఇథనాల్‌కు సబ్సిడీ ఇచ్చే ఆలోచనలో ఉందట కేంద్రం. ఇథనాల్.. సిలిండర్లలో రాదు. వినియోగదారులు డబ్బాలు తీసుకెళ్లి పెట్రోల్ పంపుల్లో కియోస్క్‌ల ద్వారా నింపు కోవాల్సి ఉంటుంది. కేంద్రం ప్రతిపాదన రాత్రికి రాత్రే ఎల్‌పిజి స్థానాన్ని ఇథనాల్‌తో భర్తీ చేయదు. తొలుత గృహాలు, రెస్టారెంట్లు, వాణిజ్యానికి ప్రత్యామ్నాయ ఇంధనంగా మారవచ్చు.

దేశంలో పెరుగుతున్న మిగులు ఇథనాల్ దీనికి ప్రధాన కారణం. కొన్నేళ్లుగా ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహించింది కేంద్రప్రభుత్వం. రైతులకు మద్దతు ఇచ్చింది. పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలిపి సక్సెస్ అయ్యింది. పటిష్టమైన దేశీయ ఇథనాల్ ఉత్పత్తి వ్యవస్థను సృష్టించింది. ఇప్పుడు వంట గ్యాస్ పై ఫోకస్ చేసింది.

ALSO READ: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్..  41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

ఇథనాల్‌ను ఎల్‌పిజికి ప్రత్యామ్నాయంగా కాకుండా అనుబంధ ఇంధనంగా పరిగణిస్తోంది. దశాబ్దాల మౌలిక సదుపాయాలు, ఉజ్వల వంటి పథకాల మద్దతుతో ఎల్‌పిజికి విస్తృతమైన పంపిణీ వ్యవస్థ ఉంది. ఇథనాల్ వంట ఇంధనం కోసం దేశవ్యాప్త సరఫరా గొలుసును నిర్మించాల్సి ఉంటుంది.

దానితోపాటు భద్రతా, నాణ్యతా ప్రమాణాలను రూపొందించాలి. వినియోగదారులు దానికి అనుకూలమైన స్టవ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పారిశ్రామిక డిమాండ్‌కు ఆటంకం కలగకుండా ఇథనాల్ సరఫరా చేయాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఇథనాల్ ఉత్పత్తి చుట్టూ విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×