E-Paper
Advertisement

షాకింగ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు! కొనేవారికి ఇదే మంచి సమయం!

షాకింగ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు! కొనేవారికి ఇదే మంచి సమయం!

Gold Silver Rates: వారెవ్వా.. ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. నిన్న మొన్నటి వరకు రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన పసిడి ధరలు, సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ఎట్టకేలకు కాస్త శాంతించాయి. గత కొద్ది రోజులుగా వరుస పెరుగుదలతో తీవ్ర ఆందోళనకు గురైన వినియోగదారులకు, నేటి ధరల తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. రాబోయే శుభకార్యాలు లేదా భవిష్యత్తు పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగానే ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ప్రధాన మార్కెట్లలో బంగారం ధరలు గణనీయంగా తగ్గడమే కాకుండా, వెండి ధరలు కూడా దిగిరావడం కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపుతోంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,750 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,550 వద్ద పలుకుతుంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,850 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,750 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,200 తగ్గింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,53,550 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,750 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,550 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,750 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,550 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,750 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,700 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,40,900 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
హమ్మయ్య.. నేడు పసిడి ధరలే కాకుండా సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి.. దీంతో ఆనందంలో మునిగితేలుతున్న సిల్వర్ ప్రియులు.. నేటి సిల్వర్ ధరల చూసుకుంటే.. నిన్న బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,75,000 కాగా.. నేడు గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,70,000 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 5,000 తగ్గింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో కూడా నేడు కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద పలుకుతోంది.

Also Read: హర్మూజ్ తెరవడానికి ఆరు నెలలా? ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు తప్పవా..?

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×