E-Paper
Advertisement

Sundar Pichai Salary: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు శాలరీ హైక్.. ఎంతో పెంచారో తెలిస్తే షాక్!

Sundar Pichai Salary: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు శాలరీ హైక్.. ఎంతో పెంచారో తెలిస్తే షాక్!
Advertisement

Sundar Pichai Salary: ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ అయిన గూగుల్, సీఈవో సుందర్ పిచాయ్ జీతాన్ని పెంచింది. దీంతో పిచాయ్ రాబోయే మూడు సంవత్సరాలలో 692 మిలియన్ల డాలర్ల (రూ. 63,61,79,82,000) జీతం అందుకోనున్నారు. దీనితో ఆయన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జీతం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు. ఈ ప్యాకేజీలో అధిక భాగం 126 మిలియన్ల డాలర్లు స్టాక్ యూనిట్ల రూపంలో సుందర్ పిచాయ్ పొందుతారు.

వార్షిక జీతం ఎంతంటే?

ఆల్ఫాబెట్ ఈ స్టాక్ యూనిట్లను S&P 100కు అనుసంధానిస్తుంది. దీంతో ఉద్యోగులకు పనితీరు లక్ష్యాలను సెట్ చేస్తుంది. పనితీరు మెరుగ్గా ఉంటే 252 మిలియన్ డాలర్ల వరకు చెల్లిస్తారు. లక్ష్యాలను చేరుకోకపోతే రాబడి ఏం లేకపోవచ్చు. పిచాయ్ మూడు సంవత్సరాలలో నెలకు 84 మిలియన్ల డాలర్ల స్టాక్ వెస్టింగ్‌ను అందుకుంటారు. అలాగే వార్షిక జీతం 2 మిలియన్ల డాలర్లు ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

4 ట్రిలియన్ల కంపెనీ

Advertisement

పిచాయ్ ఆగస్టు 2015లో సీఈవో అయినప్పటి నుంచి గూగుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ వ్యాల్యూ.. దాదాపు ఏడు రెట్లు పెరుగుదల నమోదు చేసింది. 535 బిలియన్ డాలర్ల నుండి 3.6 ట్రిలియన్లకు చేరింది. జనవరిలో 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత సంతతికి చెందిన 53 ఏళ్ల సుందర్ పించాయ్.. మెకిన్సే కన్సల్టెంట్ పనిచేశారు. 2004 లో గూగుల్‌లో చేరారు. క్రోమ్‌ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్‌ తో ఉన్నత స్థానానికి ఎదిగారు.

Also Read: ఏఐ నేర్చుకోండి కేవలం 10 గంటల్లో.. కొత్త ప్రొగ్రామ్ లాంచ్ చేసిన గూగుల్

సుందర్ పిచాయ్ షేర్లు

Advertisement

ఈ వారంలో పిచాయ్ దాదాపు 9.8 మిలియన్ డాలర్ల విలువైన 32,500 క్లాస్ సి షేర్లను విక్రయించారు. 298 నుంచి 498 మిలియన్ డాలర్ల విలువైన 1.67 మిలియన్ గూగుల్ షేర్లను సుందర్ పిచాయ్, ఆయన భార్య కలిగి ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 2025 ఆర్థిక సంవత్సరంలో 96.5 మిలియన్ డాలర్లు సంపాదించగా, ఆపిల్ టిమ్ కుక్ 74.3 మిలియన్ డాలర్లు సంపాదించారు.

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×