E-Paper
Advertisement

హైదరాబాద్ నుంచి Zomato అవుట్? 250 మంది ఉద్యోగుల తొలగింపు?

హైదరాబాద్ నుంచి Zomato అవుట్? 250 మంది ఉద్యోగుల తొలగింపు?
Advertisement

Zomato Layoffs:స్విగ్గి.. జోమాటో….ఈ ఫుడ్ సర్వీస్ యాప్స్ ఇవి ఎంత పాపులరో చెప్ప క్కర్లేదు.ముఖ్యంగా మన హైదరాబాదులో ఇపుడు ఎక్కడ,ఎప్పుడు చూసినా రయ్యి రయ్యి మంటూ టూ వీలర్స్ పై పరుగులు తీస్తూ కస్టమర్స్ కి ఫుడ్ అందిస్తూ మంచి పేరు సంపాదించుకున్న ఫుడ్ డెలివరీ ఆప్స్ ఇవి .

అలాంటి వీటిలో ముఖ్యమైన జొమాటో ఇప్పుడు ఒక షాకింగ్ డిసిషన్ తీసుకుందని తెలుస్తుంది.అవును.. తమ సంస్థలో పని చేసే 250 మందికి లేఆఫ్స్ ఇవ్వనుందట జొమాటో .

కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ క్లోజ్ 

Advertisement

విషయంలోకి వెళ్తే హైదరాబాదులోని జొమాటో తన కస్టమర్ సపోర్ట్ సెంటర్ ని మూసివేయాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది. దీంతో అక్కడ పనిచేస్తున్న దాదాపు 250 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలని కోల్పోబోతున్నారన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఇది సంస్థ ఖర్చులు తగ్గించుకునే కాదని,కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఇలా 250 మందికి మంగళం పాడుతుందట జొమాటో.

గురుగ్రామ్ హెడ్ ఆఫీస్ కి తరలింపు

ఇక హైదరాబాదులో తమ కస్టమర్ సపోర్ట్ సెంటర్ ని క్లోజ్ చేసినా కానీ తమ సంస్థ కార్యకలాపాలని పూర్తిగా ఆపివేయడం లేదట. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న ఇన్ హౌస్ కస్టమర్ సపోర్ట్ టీం ని హర్యానాలోని గురుగ్రామ్ హెడ్ ఆఫీస్ కి తరలించనుంది.

Advertisement

దీంతో ప్రొడక్ట్, టెక్నాలజీ, అనలిటిక్స్ టీమ్‌లకు స్టమర్ సపోర్ట్ విభాగాన్ని మరింతగా దగ్గరగా తీసుకురావడమే కంపెనీ ప్రధాన ఉద్దేశం అని తెలుస్తుంది. ఇక ఇందులో భాగంగానే గత ఆరు నెలలుగా తమ కస్టమర్ కేర్ కు సంబంధించిన కొన్ని సేవలను థర్డ్ పార్టీ సంస్థలకు అప్పగించే ప్రక్రియ కూడా పెరిగినట్టు తెలుస్తుంది .

ఉద్యోగాలు కోల్పోయే వారికి  గుడ్ న్యూస్

అయితే తమ సంస్థలో తీసుకునే ఈ నిర్ణయం కారణంగా ఇందులో ఉద్యోగాలు కోల్పోయే వారికి జొమాటో మంచి గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది. అవును ఆగస్టు నెల సాలరీతో పాటుగా  కాంట్రాక్ట్ నోటీస్ పే,ఎక్స్‌గ్రేషియా..ఇలామొత్తం కలిపి మొత్తం నాలుగు నెలల వేతనానికి సమానమైన  సెవెరెన్స్ ప్యాకేజీ ని కూడా అందించనుందట జొమాటో.

అంతేకాదు ఉద్యోగం నుండి రిలీవైన వారికి మెడికల్ ఇన్సూరెన్స్, కౌన్సెలింగ్ సపోర్ట్ వంటివి 2027 మార్చి 31 వరకు కంటిన్యూ చేసుకునే ఛాన్స్ జొమాటో ఇచ్చినట్టు తెలుస్తుంది.ఏది ఏమైనా ఇలా ఉన్నపళంగా తీసివేయకుండా కంపెనీలో పని చేసిన ఉద్యోగుల బాగు కోరుకుంటూ తీసుకున్న నిర్ణయం మెచ్చుకోతగ్గదే .

జొమాటో కే పరిమితం కాలేదు 

అయితే ఈమధ్య ఈ లే ఆఫ్స్ అనేది ఒక జొమాటో కే పరిమితం కాలేదు ఈమధ్య చాలా సంస్థలు తమ ఉద్యోగులను వదిలించుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఏఐ ,చాట్ బాక్స్ ,ఆటోమేషన్ వంట థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి చాలా సంస్థలు .ఇందులో కస్టమర్ల సాధారణ సమస్యల్ని ఏఐ ఆటోమేషన్ వంటి వాటి ద్వారా పరిష్కరించుకునే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది.

 ఇంకెన్ని సంస్థలు నడుస్తాయో?

ఏది ఏమైనా ఒకప్పుడు వేలాది ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన కస్టమర్ సపోర్ట్ రంగంలోనే ఇప్పుడు ఉద్యోగాల కోసం మొదలైపోయింది .చూడాలి ముందు ముందు ఈ జొమాటో బాటలో ఇంకెన్ని సంస్థలు నడుస్తాయో .

Tags

Related News

డబ్బు సంపాదించడానికి డిగ్రీలు అవసరం లేదు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే ఈ కెరీర్లు బెటర్

బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు, ఇంకెందుకు ఆలస్యం

కొత్త ఇల్లు కొనబోతున్నారా? ఈ తప్పులు చేయకండి.. కొనేముందు ఇవి తప్పక చెక్ చేయాలి

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. EPFO ​ఎందుకు ​సలహా ఇచ్చింది?

సెప్టెంబరు నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు, మూడు రోజుల సమ్మె కూడా

సినిమా థియేటర్లలో కునుకు సేవలు.. ఉద్యోగులను ఆకట్టుకున్న స్కీమ్, అన్నీ ఉచితంగానే

మోదీ ప్రభుత్వం రూ. 5 లక్షల క్రెడిట్ కార్డు ఆఫర్.. ప్రయోజనాలు తెలుసా? ఎవరు పొందుతారు?

Big Stories

Advertisement
×