E-Paper
Advertisement

Shani Vakri 2024: శని ప్రభావం..122 రోజులు 3 రాశుల వారికి శుభ యోగం

Shani Vakri 2024: శని ప్రభావం..122 రోజులు 3 రాశుల వారికి శుభ యోగం
Advertisement

Shani Vakri 2024: శని క్రూరమైన గ్రహంగా భావిస్తుంటారు. శని ఏ రాశిలో అయితే శుభ స్థానంలో ఉంటాడో ఆ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. శని అశుభ దృష్టి రాశులపై పడినప్పుడు సాడే సాతీ యొక్క చెడు ప్రభావం వ్యక్తుల జీవితాన్ని బాధతో నింపుతుంది. అయితే శని నెమ్మదిగా రాశిచక్రాన్ని మారుస్తాడు. ప్రస్తుత సమయంలో శనిదేవుడు తిరోగమన దిశలో ఉన్నాడు.

నవంబర్ 15 వరకు శని తిరోగమిస్తాడు. ఈ పరిస్థితిలో శని యొక్క తిరోగమన కదలికలు కొన్ని రాశులకు ధనయోగాన్ని కలిగించడంతో పాటు అనేక శుభాలను కలిగిస్తుంది.
మేష రాశి:
మేషరాశి వారికి వచ్చే 122 రోజులపాటు శని యొక్క ప్రభావం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. మేషరాశి పదకొండవ ఇంట్లో శని తిరోగమనంలోకి వెళ్లనున్నాడు. ఈ రాశివారు ఉద్యోగ, ఉపాధి జీవితంలో అనేక శుభవార్తలు వింటారు. ఈ రాశి వారి ఎదుగుదలకు శని తిరోగమనం ఎంతగానో సహాయపడుతుంది. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులకు ఇది మంచి సమయం. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. వాటిని మాట్లాడటం ద్వారా పరిష్కరించుకోండి.
సింహ రాశి:
శని తిరోగమనం వల్ల కుంభరాశి వారికి 122 రోజుల పాటు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిచక్రంలోని ఏడవ ఇంట్లో శని తిరోగమనంలో సంచరించనున్నాడు. దీంతో మీ జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఏదుర్కుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో కుటుంబంతో కలిసి ఆనంద క్షణాలను కూడా గడుపుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.

Advertisement

Also Read: ఈ 5 రాశుల వారు రాత్రికి రాత్రే ధనవంతులు కాబోతున్నారు..

ధనస్సు రాశి:
శని తిరోగమన కదలిక వల్ల ధనస్సు రాశి వారికి 122 రోజుల పాటు ప్రయోజనకరంగా ఉంటుంది. శని ధనస్సు రాశి వారి మూడవ ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో వీరికి సమాజంలో హోదా, ప్రతిష్టలు పెరుగుతాయి. శని యొక్క శుభ ప్రభావంతో అనేక పనుల్లో విజయాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఈ సమయంలో మీరు కొత్త పెట్టుబడి ఎంపికలను కూడా పొందుతారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×