BigTV English

Amaravati: దక్షిణాదికి శుభవార్త.. అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు, ఎలైన్‌మెంట్‌కు ఆమోదం

Amaravati: దక్షిణాదికి శుభవార్త.. అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు, ఎలైన్‌మెంట్‌కు ఆమోదం

Amaravati: రాష్ట్రల రాజధానుల మధ్య వేగంగా నడిచే రైళ్లకు శ్రీకారం చుడుతోంది కేంద్రప్రభుత్వం. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల రాజధానులను కలుపులు బుల్లెట్ రైళ్లు నడిపేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి మీదుగా రెండు రైళ్లకు ప్లాన్ చేస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌‌ మీదుగా రెండు బుల్లెట్ రైళ్లకు ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతి మీదుగా ఆయా రైళ్లు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ వయా అమరావతి మీదుగా చెన్నై ఒకటి, మరొకటి హైదరాబాద్ వయా అమరావతి మీదుగా బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రాథమికంగా ఆమోదం లభించినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ మీదుగా రెండు హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మాణం జరగనుంది. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల రూపురేఖలు మారనున్నాయి. ఈ రెండు కారిడార్లు హైదరాబాద్ నుండి శంషాబాద్ వరకు కామన్ కారిడార్ ఉండనుంది. అక్కడి నుంచి చెన్నై ఒకటి.. బెంగళూరు మరొక కారిడార్ లు ఉండనున్నాయి.


హైదరాబాద్‌ నుంచి వయా అమరావతి మీదుగా చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌ కోసం మూడు ఎలైన్‌మెంట్లను పరిశీలించారు. అందులో ఒకటి 744.57 కిలోమీటర్లు కాగా, మరొకటి 839.5 కిలోమీటర్లు, 749.5 కిలోమీటర్లతో పరిశీలించారు. అందులో 744.5 కిలోమీటర్ల ఎలైన్‌మెంట్‌ను ప్రాథమికంగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

ALSO READ: 53,922 కోట్ల పెట్టుబడులు.. 83 వేల ఉద్యోగాలు, ఏపీకి మహర్థశ

తెలంగాణలో ఆరు, ఏపీలో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్‌ నిర్మించనున్నారు. హైస్పీడ్‌ రైలు కారిడార్‌ శంషాబాద్ నుంచి మొదలై నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా అమరావతికి రానుంది. అక్కడి నుంచి గుంటూరు మీదుగా చీరాల వెళ్లనుంది.

ఇక హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌లో ఆయా స్టేషన్లు ప్రతిపాదించారు. వాటిలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ ఉండనున్నాయి.  అంటే విజయవాడ-చెన్నై రైల్వేలైన్‌కు సమాంతరంగా కంటిన్యూ కానుంది. తెలంగాణలో 236.48 కిలోమీటర్లు, ఏపీలో 448.11 కిలోమీటర్లు, తమిళనాడులో 59.98 కిలోమీటర్లు బుల్లెట్ రైలు నడవనుంది.

హైదరాబాద్ నుంచి బెంగుళూరు విషయానికొద్దాం. హైస్పీడ్‌ రైలు కారిడార్‌కు మూడు ఎలైన్ మెంట్లను పరిశీలించారు. అందులో 576.6 కిలోమీటర్లు, 558.2 కిలోమీటర్లు, 621.8 కిలోమీటర్లతో మూడింటిని పరిశీలించారు. అందులో 576.6 కిలోమీటర్ల ఎలైన్‌మెంట్‌ను ప్రాథమికంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

దీనికోసం తెలంగాణ-4, ఏపీ- 6, కర్ణాటక-3 స్టేషన్లు నిర్మించనున్నారు. అనంతపురం సమీపంలో కియా పరిశ్రమ ఉండడంతో దుద్దేబండ వద్ద స్టేషన్‌ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణలో 218.5 కిలోమీటర్లు, ఏపీలో 263.3 కిలోమీటర్లు, కర్ణాటకలో 94.80 కిలోమీటర్లు ఉండనుంది.

హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్ కారిడార్‌లో ఏపీలో ఆయా ప్రాంతాల్లో స్టేషన్లను ప్రతిపాదించారు. వాటిలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం ప్రాంతాలు ఉండనున్నాయి. బుల్లెట్ రైలు వస్తే ప్రయోజనం ఏంటి? ఎంత సేపట్లో చేరుకోగలము అన్నది అసలు పాయింట్.

తొలుత హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైళ్ల కారిడార్లు పూర్తి కావాలి. బెంగళూరు-చెన్నై మధ్య బుల్లెట్‌ రైలు అందుబాటులోకి వస్తే దక్షిణాది నగరాల మధ్య బుల్లెట్‌ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది. దీనివల్ల ఆయా నగరాలకు గంట నుంచి రెండు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది.

Related News

AP investments: 53,922 కోట్ల పెట్టుబడులు.. 83,000 ఉద్యోగాలు.. ఏపీలో ఇక పండగే!

Vizag investment: విశాఖకు స్పెషల్ బూస్ట్‌.. ఐటీలో వేరే లెవల్.. భారీ పెట్టుబడి వచ్చేసిందోచ్!

Bapatla news: దివ్యాంగుల ధైర్యం.. బాపట్లలో వినూత్న వివాహం.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే!

AP Govt updates: రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంట కొనుగోలుకు రేటు ఫిక్స్.. మీరు సిద్ధమేనా!

AP family card: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త కార్డు రెడీ.. ఎందుకంటే?

Big Stories

×