Cloud Burst: ఇది అల్ప పీడనం కాదు.. జనాన్ని పట్టి పీడించుకునే వర్షాలు. తెలంగాణపై వరుణుడు పగబట్టాడా..? మేఘాలు గర్జిస్తున్నాయెందుకు? చెరువులు, ఊర్లు ఏకమయ్యాయి ఎందుకు? వద్దంటే వాన.. వదలని వరద.. ఎన్నడూ చూడని వాగుల ఉగ్రరూపం.. తెలంగాణలో ఎందుకిలా జరుగుతోంది..? వాతావరణ మార్పులకు ఇది సంకేతమా? భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉండడమే శాపమా? లేటెస్ట్ జల ప్రళయంతో ఎంత నష్టం జరిగింది?
వద్దంటే వాన.. వదలని వరద..
కామారెడ్డి జిల్లా దోమకొండ నుంచి సంగమేశ్వరం వెళ్లే రూట్లో జేసీబీ వాగు దాటుతుంటే.. ఇంకోవైపు కారు వరదలో ఆపుకుని ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. జేసీబీ అవతలి ఒడ్డుకు అలా చేరిందో లేదో.. ఆ నీటి ఫోర్స్‌కు కారుతో సహా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. బానెట్ పట్టుకుని కారుతో సహా కొట్టుకుపోయారు. కామారెడ్డిలో వరద విలయం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఇఫ్పుడు చెప్పినా ఈ ఎగ్జాంపుల్ చాలు.
మారిపోయిన కామారెడ్డి షేప్
అసలు టౌన్ షేప్ మొత్తంగా మారిపోయింది. అసలు ఇక్కడ కామారెడ్డి ఉందా.. జనం ఉన్నారా.. అన్న డౌట్లు వస్తాయి. పాలు, నీళ్లు, ఫుడ్ అన్నిటికీ ఇబ్బందులే. ఎందుకంటే బయటకా రాలేరు. డ్రోన్ విజువల్ చూస్తే కామారెడ్డి టౌన్‌లో ఒక్క రోడ్డైనా అసలు కనిపిస్తుందా? ఇండ్ల చుట్టూ వరదే ఉంది. లోపల ఉండలేరు. బయటకు రాలేరు అన్నట్లు పరిస్థితి ఉందక్కడ. ఆస్తి నష్టం చాలానే జరిగి ఉంటుంది. ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కామారెడ్డిలో కొంచెం వరద తగ్గాక ఇదీ సీన్.. ఎక్కడికక్కడ లారీలు, బస్సుల పరిస్థితి ఇదీ. ఇంకా రెయిన్ అలర్ట్ ఇస్తూనే ఉంది. వర్షం పడుతూనే ఉంది. జనం అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కామారెడ్డి జిల్లా పోలీసులు అలర్ట్ ఇచ్చారు.
సిద్దిపేటలో కట్టలు తెంచుకున్న ప్రవాహాలు
వర్షాలు ముందుకు వెళ్తూ సిద్ధిపేటను ముంచేశాయి. సిద్ధిపేట కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. నీటి ప్రవాహాలు కట్టలు తెంచుకున్నాయ్. రోడ్లేవో, చెరువేదో అర్థం కాని పరిస్థితి. ఏ గల్లీ చూసినా మోకాలి లోతు నీళ్లే. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో.. అప్పర్ మానేర్ డ్యాం దగ్గరి సీన్. నీటిలో చిక్కుకుని సాయం కోసం ఐదుగురు రెండు రోజులు ఎదురు చూశారు. వీరికి బుధ, గురు వారాల్లో డ్రోన్ తో ఫుడ్ సప్లై చేశారు. చివరికి IAF హెలికాప్టర్ పంపి వారిని రెస్క్యూ చేశారు.
2 రోజుల్లో 60 సెం.మీ అంటే మాటలా..!
అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలులు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలపై ప్రభావం చూపించాయి. దీని ప్రభావంతో రెండు రోజుల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే మాటలు కాదు. తాజాగా ఈ ఎఫెక్ట్ ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలపై ఉండే అవకాశం కనిపిస్తోంది. వర్షం కురిసిందా.. ఎక్కడా 10 సెంటీమీటర్లకు తగ్గకుండా పడుతోంది. మేఘాలన్నీ ఒకచోటే కుంభవృష్టి కురిపించేస్తున్నాయ్. ఒక గంటలో 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల దాకా వర్షం పడితే క్లౌడ్ బరస్ట్ గా చెబుతారు. అయితే వర్షం కురిసిన అంచనాను వేసే పాయింట్ల దగ్గర కాకుండా మిగితా చోట్ల ఎక్కువే కురిసి ఉంటుంది.
కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలకు ఫ్లాష్ ప్లడ్ అలర్ట్
చెప్పాలంటే ముప్పు ఇంకా తొలగిపోలేదు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల ఇలాంటి చోట్ల ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. వరద ఉప్పొంగొచ్చు, ప్రాణాలూ తీయొచ్చు. అందుకే బీ అలర్ట్. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, ములుగులో అతి భారీ వర్షాలు, వరదలకు ఆస్కారం ఉందంటున్నారు. ఓవైపు అల్పపీడనం ఎఫెక్ట్.. ఇంకోవైపు నైరుతి రుతుపవనాలు జాయింట్ గా జనాన్ని ఓ ఆట ఆడేసుకుంటున్నాయి. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడం, ఉష్ణోగ్రతల పెరుగుదల, స్థానికంగా తేమ శాతం పెరగడం కూడా భారీ వర్షాలకు కారణమవుతున్నాయి.
మేఘాలన్నీ ఒకే దగ్గర కుమ్మరించేస్తున్నాయ్
అల్పపీడనం ఎఫెక్ట్ ఎక్కువున్న ప్రాంతాల్లో మేఘాలన్నీ ఒకచోటికి చేరి కుంభవృష్టి కురిపించేస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాలు ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ భౌగోళికంగా ఎత్తైన ప్రాంతాలు కావడంతో మేఘాలన్నీ అక్కడే ముంచేస్తున్నాయి. వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో అసాధారణ వాతావరణ పరిస్థితులు హఠాత్తుగా సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పులతో మేఘాలన్నీ ఒకే చోట ఎక్కువ సమయం ఉండిపోతున్నాయి. సో అక్కడే తక్కువ టైంలో ఎక్కువ వర్షంతో ముంచెత్తుతున్నాయి. ఈ మాన్ సూన్ సీజన్ లో మేఘాల కదలికల్లో మార్పులు రావడం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లోనే అతి భారీ వర్షాలు కురుస్తున్నాయంటున్నారు.
రాగల 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.. రెడ్, ఆరెంజ్, యెల్లో అలర్ట్స్ ఇచ్చేశాం అంటే కుదరట్లేదు. ఎందుకంటే వెదర్ ఈవెంట్స్ క్షణక్షణానికి అప్డేట్ అవుతున్నాయి. ఇవన్నీ ఊహించని వాతావరణ మార్పుల కారణంగానే జరుగుతున్నాయ్. తాజాగా కామారెడ్డి, మెదక్ ఉదాహరణలే చూస్తే ఇంత భారీ వర్షం పడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. మరి వాతావరణం అంచనాలకు అందట్లేదా? అంచనా వేయలేకపోతున్నారా? ముందస్తుగా అలర్ట్ గా ఉంటే భారీ ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంటుంది కదా..? గతానికి ఇప్పటికి వర్షాలు, వరద నష్టాలపై ఏం మారింది?
గతం కంటే మించిన వర్షం, వరద సీన్లు
ఇప్పుడు కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సిద్ధిపేట లాంటి చోట్ల.. గతం కంటే మించిన వర్షం, వరద సీన్లు కనిపిస్తున్నాయ్. ఈ అతి భారీ వర్షాలు, వరదలతో మనుషుల ప్రాణాలకే గ్యారెంటీ లేదు.. ఇక పంటలు, పశుపక్ష్యాదుల సంగతి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పంటన్నీ నీటమునిగే కనిపిస్తున్నాయ్. పెద్ద ఎత్తున ఆస్తి నష్టాలు జరిగాయ్. ప్రాణ, ఆస్తి నష్టాల లెక్క ఈ వర్షాలు తగ్గితేనే తెలుస్తుంది. ఓవైపు వర్షాలు బీభత్సం సృష్టిస్తుంటే.. వాతావరణ శాఖ సరిగా అంచనాలు వేయలేకపోతోందా? అసాధారణ వాతావరణ పరిస్థితులపై అందరినీ అలర్ట్ చేయలేకపోతోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పాత ఎగ్జాంపుల్స్ ఎందుకు.. లేటెస్ట్ గా ఆగస్ట్ 26, 27 తేదీల్లో జరిగిన వర్ష బీభత్సాన్నే తీసుకుందాం. కామారెడ్డి, మెదక్, నిర్మల్ పరిస్థితులను IMD పూర్తిస్థాయిలో అంచనా వేయలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. కానీ అసలైన ఉపద్రవాన్ని గుర్తించలేకపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏదో వర్షం పడుతుంది.. వరద వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వాన జడివాన అయింది. కామారెడ్డి జిల్లా అర్గొండలో 24 గంటల నుంచి 48 గంటల రెయిన్ ఫాల్ చూస్తే అత్యధికంగా 60 సెంటీమీటర్ల దాకా వర్షపాతం నమోదైంది. దీన్ని వాతావరణ శాఖ అస్సలు ఊహించలేదు. అలర్ట్ ఇవ్వలేదు. గ్రౌండ్ లెవెల్‌లో కూడా ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయింది.
IMD మరింత కచ్చితత్వ అంచనాలు అవసరం
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే IMD మరింత కచ్చితత్వంతో గ్రౌండ్ లెవెల్ అంచనాలు రిలీజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. నిజానికి వాతావరణ శాఖ వాడే శాటిలైట్ టెక్నాలజీస్, AI మోడల్స్ వచ్చాయి. వీటిని ఉపయోగించి.. చివరి క్షణంలో కూడా అలర్ట్ ఇచ్చేలా చూడాలన్న వెర్షన్ వినిపిస్తోంది. శాటిలైట్, రాడార్, న్యుమరికల్ వెదర్ ప్రిడిక్షన్స్, గ్లోబల్, రీజినల్ మోడల్స్ వీటన్నిటినీ చూడాలి. అల్పపీడనం, రుతుపవనాల కదలికలు, ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులకే పరిమితం కాకుండా.. అసాధారణ వెదర్ కండీషన్స్ అంటే క్లౌడ్ బరస్ట్, అలాగే క్లౌడ్స్ ఫామింగ్ నూ క్యాచ్ చేసేలా ఉండాలి. IMD రోజువారీ బులెటిన్లు షార్ట్-రేంజ్ ఫోర్‌కాస్ట్‌లు సాధారణంగా 70-80% కచ్చితత్వంతో ఉంటున్నాయి. అయితే గ్రామ, మండల స్థాయిల్లో మాత్రం కొన్నిసార్లు అంచనాలు తప్పుతున్నాయ్. తెలంగాణలోని భౌగోళిక లక్షణాలు అంటే ఎత్తైన ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో అప్పటికప్పుడు హఠాత్తుగా వెదర్ మారిపోతుంటుంది. వీటిని అప్పటికప్పుడు అంచనా వేయడం కష్టమే అయినా గ్రామీణ ప్రాంతాల్లో కాకపోయినా కనీసం పట్టణప్రాంతాల్లో నష్టాలు తగ్గించేందుకు గుర్తించగలగాలి. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో వరదలో చిక్కుకున్న జనాన్ని.., అలాగే రామాయంపేటలో చివరి నిమిషంలో హాస్టల్ పిల్లలను రెస్క్యూ చేయాల్సి వచ్చింది.
Also Read: పక్క పార్టీ నేతలపై ఫోకస్.. బీఆర్ఎస్ ముందస్తు వ్యూహం
మైక్రోస్కేల్ లెవెల్‌లో అంచనా వేసేదెలా?
హైదరాబాద్‌లోని డాప్లర్ వెదర్ రాడార్ 250 నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో వాతావరణ మార్పులను పసిగట్టగలదు. కానీ మైక్రో స్కేల్ లెవెల్ లో ఆసక్మిక వాతావరణ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ఇవన్నీ ఒకటి రెండు గంటల ముందే ఇచ్చే వీలు ఉంటుంది. ఇక రాత్రి సమయాల్లో అందరూ పడుకున్నప్పుడు అలర్ట్ ఇచ్చినా గమనించే పరిస్థితి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా వెదర్ డైనమిక్స్ మారిపోతున్నాయి. ఆకస్మికంగా హఠాత్తుగా మార్పులు వస్తున్నాయి. ఇవి అంచనాలు వేయడంలో సంక్లిష్టంగా మారుతున్నాయి. సో మారుతున్న కాలానికి ముప్పు పెరుగుతుండడంతో అన్ని ప్రాంతాల్లో వాతావరణ కేంద్రాలు అలాగే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. డాప్లర్ రాడార్ లు పెరిగితే రిమోట్ ఏరియాల్లోనూ కచ్చితమైన అంచనాలకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో డాప్లర్ రాడార్ లు ఏర్పాటు చేస్తే కచ్చితమైన అబ్జర్వేషన్ సాధ్యపడుతుంది. హై రిజల్యూషన్ మోడల్స్ తో మైక్రో లెవెల్ లో కచ్చితమైన అంచనాలు వేసేందుకు వీలవుతుంది.
Story By Vidya Sagar, Bigtv