Gundeninda GudiGantalu Today episode August 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. రవి కారు కొన్నావు కదా మరి పార్టీ ఏది అన్నయ్య అని మనోజ్ ని అడుగుతాడు. రాత్రి టెర్రస్ పై పార్టీ కావాలి మాకు అని రవి అడుగుతాడు. ఇక రాత్రి అవ్వగానే రవి సైగలు చేస్తూ ఉంటాడు బాలుని పైకి రమ్మని అడుగుతాడు. బాలు మాత్రం మీనాకి ఇచ్చిన మాట ప్రకారం తాగకుండా పైకి వెళ్లి కూర్చుంటాడు. మనోజ్ బిజినెస్ ఐడియాల గురించి అడుగుతుంటే బాలు అతనిపై సెటైర్ల వర్షం కురిపిస్తాడు. కింద ముగ్గురు కోడళ్ళు ఒక చోటికి చేరి ముచ్చట్లు పెట్టుకుంటారు. మీనా ఇచ్చిన బిజినెస్ ఐడియా వల్ల రోహిణి దారుణంగా మీనాని అవమానిస్తుంది.. బాలు కి ఎటువంటి పర్మిషన్ అవ్వలేదు బాటిల్ కనిపిస్తే చాలు తాగేసి దొర్లుతూ ఉంటాడు అని రోహిణి అవమానించేలా మాట్లాడుతుంది. ఇదంతా ఎందుకు పైకి వెళ్లి చూద్దాం కదా అని అక్కడికి వెళ్తారు. మనోజ్ తాగేసి నాన్న రభస చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు షాప్ చూసాడు అంటే అది కచ్చితంగా పూల కొట్టు అది ఇది అని ప్రభావతి దారుణంగా అంటుంది.. కానీ అదొక ఫర్నిచర్ షాప్ అనగానే అందరూ నోరులు వెళ్లబెడతారు. బాలుని తలా ఒక మాట అనేస్తారు.. బాలుని మీనా మీరు ఒకసారి పక్కకు రండి అని పిలుస్తుంది. దారిన పోయే దురద మీకెందుకు అని మీనా క్లాస్ పీకుతుంది.. వాడు మంచోడే కానీ సోమరిపోతు వాణ్ని ఒక దారిలో పెడితే నాన్నకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాడు కదా అలా ఆలోచించి ఇలా చేశాను అని మీనాకు సమాధానం చెప్తాడు.
మా నాన్న సంతోషమే నాకు కావాలి వాడు బాగుపడితే మా నాన్న చాలా సంతోషపడతాడు అని మీనాతో అంటాడు.. మీనా మీరు ఏదైనా లాభం లేకుండా చేయరా ఏంటి అని ఎగతాళిగా మాట్లాడుతుంది.. అందరూ కలిసి షాపును చూడడానికని అక్కడికి వెళ్తారు.. చాలా పెద్ద షాపు అని ప్రభావతి సంతోషపడుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఈ షాప్ ను చూపించింది మా ఆయన అని మీనా అంటే.. కొనాల్సింది మనోజ్ అని రోహిణి ఇద్దరు పోటీ పడతారు.. మధ్యలో ప్రభావతి కలగజేసుకుని చూపించాడు లే కొనాల్సింది నా కొడుకే కదా అని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతుంది..
షాప్ ఓనర్ వచ్చే ముందు షాప్ ని చూసుకోండి మీకు నచ్చిందంటే తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుంటామని అంటాడు.. బాలు గొప్పదనం గురించి అందరికీ వివరిస్తాడు.. అది విన్న సత్యం మురిసిపోతాడు. ఇక మనోజ్ షాప్ ని చూడకుండా వెళ్లి సీట్లో కూర్చుంటాడు. ఓనరు ప్లేస్ లో కూర్చుంటే ఆ దర్జానే వేరు అని ప్రభావతి కూడా మురిసిపోతుంది.. మనం ఇంకా డబ్బులు కట్టకుండానే ఓనర్స్ ఎట్లా కూర్చుంటే ఏం బాగుంటుంది అని అందరూ అంటారు.
షాప్ మాకు నచ్చింది మేము తర్వాత వచ్చి పూర్తి వివరాలు మాట్లాడదామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. ఆ తర్వాత ఇంట్లో భోజనం చేస్తూ మీనాపై ప్రభావతి రెచ్చిపోతుంది.. అందరూ కలిసి భోజనం చేస్తుంటే మీనాన్ని కూడా కూర్చొని తినమని శృతి అడుగుతుంది. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు ఎప్పుడు వడ్డిస్తూనే ఉంటావు కానీ ఏ రోజు తినలేదు కదా అని అడుగుతుంది. నేను తినలేదు కానీ మీ అందరి తిన్న తర్వాతే తింటాను.
Also Read : ప్రాణాలతో పోరాడుతున్న నర్మద తండ్రి.. మామకు మాటిచ్చిన అల్లుడు..శ్రీవల్లి మరో ప్లాన్…
దానికోసం కూరలు దాచిపెట్టుకుంటుంది లేదా ఏదో కొత్త కొరకు చేసి పెట్టుకుంటుంది అని ప్రభావతి అంటుంది.. ఆ మాట వినగానే మీనా లేచి నేను ఎక్కడ కూర దాచి పెట్టుకున్నానో చూపించండి అని అంటుంది.. సత్యం లేచి చూపించు ఎక్కడ దాచిపెట్టుకుందో అయినా కానీ తనకోసం కూరను దాచిపెట్టుకున్న పెద్ద సమస్య లేదు కదా అని అంటాడు. రవి మనం వంటలు రుచిగా ఉన్నాయని అంత మొత్తం వేసుకొని తింటాం వదినకుందో లేదో కూడా పట్టించుకోము.. అలాంటిది వదిన మీద ఇలా మాట్లాడడం మంచిది కాదమ్మా అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…