BigTV English

Brahmamudi Serial Today August 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్పృహలోకి వచ్చిన రాజ్‌ – కావ్య కోసం ఆరా తీసిన రాజ్‌

Brahmamudi Serial Today August 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్పృహలోకి వచ్చిన రాజ్‌ – కావ్య కోసం ఆరా తీసిన రాజ్‌

Brahmamudi serial today Episode: రాజ్‌ హాస్పిటల్‌ ఐసీయూలో ఉంటే బయట కూర్చున్న అపర్ణ బాధపడుతుంది. అంతా నా వ్లలే జరిగింది. నేను నిజం చెప్పడం వల్లే ఇవాళ రాజ్‌కు ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ ఏడుస్తుంది. అమ్మా కావ్య నన్ను క్షమించవే నువ్వు ఇలాంటివి జరగకూడదని మా అందరికీ ఎంత నచ్చజెప్తున్నా నేను వినకుండా క్షణికావేశంలో నేను చేసిన తప్పు ఈరోజు వాడిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది కావ్య అంటూ బాధపడుతుంటే.. అత్తయ్యా మీరు నాకు క్షమాపణలు కోరడం ఏంటి..? నేను ఆయనకు భార్య అవ్వక ముందే మీరు ఆయనకు తల్లి అయ్యారు అత్తయ్యా నవమాసాలు మోసి ఆయనకు జన్మనిచ్చారు అలాంటిది మీరు ఆయన విషయంలో తప్పు చేయాలని ఎందుకు అనుకుంటారు అంటుంది.


దీంతో నా బాధ కూడా అదే కావ్య ప్రాణం పోసిన నేనే ఈరోజు వాడి ప్రాణం మీదకు తీసుకొచ్చాను. వాడి తల్లిని అని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదు కావ్య అంటూ బాధపడుతుంటే.. యామిని చప్పట్లు కొట్టుకుంటూ అక్కడకు వస్తుంది. వావ్‌ చాలా బాగుంది. మీ అందరి నటన అద్బుతంగా ఉంది. నీది తప్పు లేదు అంటే నీది తప్పు లేదు అనుకుంటూ చేతులు దులిపేసుకుంటున్నారా..? ఏంటి అందరూ అలా చూస్తున్నారు. నేను చేసిన సహాయానికి మీరందరూ నా కాళ్లు కడిగి ఆ నీళ్లు మీ నెత్తి మీద చల్లుకోవాలి. రాజ్‌ గతం మర్చిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే నేను తోడుగా నిలబడ్డాను. నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా పరిచయం చేసి తనకొక కొత్త జీవితాన్ని ఇచ్చాను. గతం తెలిస్తే తనకు ప్రమాదం అని డాక్టర్లు చెబితే తనకు ఒక రక్షణ కవచంలా మారి తనను రక్షించుకుంటూ వచ్చాను.

కానీ మీరేం చేశారు. పదే పదే గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించారు. తన ప్రాణాలతో ఆడుకోవాలని చూశారు. మీరు ఆ పెద్దావిడ ప్లాన్స్‌ వేసుకుని మరీ ఇంటికి పిలిపించుకుంటారు. ఇక ఈ కావ్య సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. తోక లాగా ఎప్ఉడూ వెనకే తిరుగుతుంది. గతాన్ని గుర్తు చేయాలని ట్రై చేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఇలా జరగకపోతే ఎలా జరుగుతుంది. అసలు మీ అందరికీ రాజ మీద బాధ్యతే లేదు.. నాకు తప్ప.. మీ అందరికీ చెప్తున్నాను. రాజ్‌కు ఏమైనా జరగాలి మీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. కావ్య కోపంగా వెళ్లి యామిని చెంప పగులగొడుతుంది. దీంతో యామిని తప్పు చేసిందే కాక నన్నే కొడతావా..? అంటూ కొట్టబోతుంటే..


కావ్య కోపంగా ఏయ్‌  నువ్వేంటో నీ బతుకేంటో ఇక్కడున్న అందరికీ తెలుసు. అలాంటి నువ్వు నా కుటుంబం మీద వేలెత్తి చూపించడానికి వచ్చావా..? సిగ్గు లేకుండా నా మొగుడిని నీ మొగుణ్ని చేసుకోవడానికి పెళ్లికి రెడీ అయిపోయిన నువ్వు నాకు నీతులు చెప్తున్నావా..?  అసలు దీనంతటికి కారణం ఎవరు నువ్వే కదా..? అంటూ కావ్య ప్రశ్నించగానే.. యామిని తడబడుతూ అది.. అంటూ ఏదో చెప్పబోతుంటే.. కావ్య ఏయ్‌ ఇంక ఆపు ఇంత జరిగినా కూడా సిగ్గు లేకుండా వాదిస్తున్నావా..? ఇంకోక్క  క్షణం నా ముందు ఉన్నావంటే చంపేస్తాను.. వెళ్లు .. అంటూ గట్టిగా అరుస్తూ వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతలో రుద్రాణి వచ్చి కావ్య ఆగు కావ్య నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అయింది. కానీ ఆ విషయం దీనికే అర్థం కావడం లేదు కావ్య.. అది అర్థం అయ్యేలా నేను చెప్తాను కదా.. నువ్వు రాజ్‌ సంగతి చూడు అంటూ యామినిని తీసుకుని బయటకు వెళ్తుంది.

యామిని కోపంగా రుద్రాణి గారు ఏం చేస్తున్నారు.. వదలండి అంటూ కోపంగా తిడుతుంది. దీంతో రుద్రాణి ఏయ్‌ ఏంటి కోపం వస్తుందా..? అనగానే కోపం రాకుండా అది ఏమైనా సన్మానం చేసిందా..? ఉండండి దాని రెండు చెంపలు వాయించి బుద్ది చెప్తాను అంటూ లోపలికి వెళ్తుంటే.. ఆ వెళ్లు ఇందాక చెంప దెబ్బలతో సరిపెట్టింది. ఈసారి ఏకంగా చంపేస్తుంది. అనగానే.. ఏంటి దానికి నేను భయపడాలా..? నా బావకు అలాంటి పరిస్థితి క్రియేట్‌ చేసిన దాన్ని వదిలేయాలా..? అంటుంది. దీంతో రుద్రాణి వదిలేయక ఏం చేస్తావు.. నువ్వు వెళ్లి తాళి కట్టించుకున్న భార్యనే బెదిరిస్తే ఎలా చెప్పు  అసలు దీనంతటికి కారణం నువ్వే అంటూ అందరూ కలిసి పిచ్చ కొట్టుడు కొడతారు. నీ అవసరం వచ్చే వరకు వెయిట్‌ చేయ్‌ ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను  అని చెప్పగానే యామిని వెళ్లిపోతుంది.

తర్వాత కావ్య పక్కకు వెళ్లి ఏడుస్తుంటే.. ఇంద్రాదేవి వెళ్లి ఓదారుస్తుంది. అయినా వినకుండా కావ్య బయట దేవుడి దగ్గరకు వెళ్లి మొక్కుతుంది. లోపల డాక్టర్‌ ఐసీయూలోంచి వచ్చి రాజ్‌కు ఇప్పుడు బాగుందని మరోసారి ఆయన్ని బాధపెట్టోదని చెప్తాడు. దీంతో అందరూ లోపలికి వెళ్తారు. అపర్ణ ఏడుస్తూ రాజ్ అని పిలుస్తుంది. రాజ్‌ కళ్లు తెరచి అటూ ఇటూ చూస్తుంటాడు.. ఏంటి నాన్నా అలా చూస్తున్నావు అని అపర్ణ అడగ్గానే. . కళావతికి ఎలా ఉందమ్మా అని రాజ్‌ అడుగుతాడు. దీంతో అపర్ణ తనకు ఏమవుతుందిరా..? అయినా ఎందుకు అలా అడుగుతున్నావు.. అంటుంది. దీంతో రాజ్‌ ఏం కాలేదు ఏంటి మమ్మీ మేమిద్దరం కారులో వెళ్తుంటేనే కదా యాక్సిడెంట్‌ అయింది. అంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటే యామిని వచ్చి చూసి బాధతో వెళ్లిపోతుంది.

ఇంతలో అప్పు వెళ్లి కావ్యను తీసుకొస్తుంది.  డాక్టర్‌ ఇంజక్షన్‌ ఇవ్వడంతో రాజ్‌ నిద్రలోకి జారుకుంటాడు. మరోవైపు ఇంటికి వెళ్లిన యామిని పిచ్చి పట్టినదానిలా బిహేవ్‌ చేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: నిజం తెలుసుకున్న పార్వతి..భానుమతిని చంపబోయిన కమల్.. మాట నిలబెట్టుకున్న అవని..

Nindu Noorella Saavasam Serial Today August 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం చెప్పడానికి షాపింగ్‌ మాల్‌కు వెళ్లిన వార్డెన్‌ సరస్వతి

Anchor Lobo: బిగ్ బ్రేకింగ్…. యాంకర్ లోబోకు జైలు శిక్ష

GudiGantalu Today episode: బాలుకు క్లాస్ పీకిన మనోజ్.. మనోజ్ కొత్త బిజినెస్.. ప్రభావతికి మైండ్ బ్లాక్..

Illu Illalu Pillalu Today Episode: ప్రాణాలతో పోరాడుతున్న నర్మద తండ్రి.. మామకు మాటిచ్చిన అల్లుడు..శ్రీవల్లి మరో ప్లాన్…

Big Stories

×