BigTV English

D-Mart: డి-మార్ట్‌ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?

D-Mart: డి-మార్ట్‌ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?

D-Mart: దేశంలోని ప్రముఖ రిటైల్  సంస్థల్లో ఒకటి డి-మార్ట్. బడ్జెట్ ధరల్లో సరుకులు, వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు డి-మార్ట్‌ కు వెళ్తుంటారు. తక్కువ ధరలో మంచి క్వాలిటీ వస్తువులు, సరుకులను అందించడంలో ముందుంటుంది. కిరాణా సామాన్లు, ఇతర గృహోపకరణాలు డి-మార్ట్‌ లో మరింత చౌకగా కొనుగోలు చెయ్యొచ్చు. చాలా వస్తువులు మీద కనీసం 7% తగ్గింపు అందిస్తుంది. మీరు బెస్ట్ డీల్స్ ను పొందాలంటే ఇలా చేయండి.


రోజువారీ కిరాణా సమాన్లపై మంచి డిస్కౌంట్స్

కిరాణా సామాన్లను తక్కువ ధరలకు కొనుగోలు చేయాలంటే డి-మార్ట్‌ బెస్ట్ స్టాప్. గోధుమ పిండి, బాస్మతి బియ్యం నుంచి వంట నూనెలు, పప్పులు, మసాలాల వరకు, ఇతర రిటైలర్స్ తో పోలిస్తే కనీసం 7% డిస్కౌంట్ అందిస్తుంది. డి-మార్ట్‌ సంస్థ నేరుగా ఉత్పత్తి దారులన నుంచి సామాన్లు తీసుకురావడంతో ఇక్కడ తక్కువ ధరకే కిరాణా సరుకులు లభిస్తాయి.5 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ తీసుకుంటే, ఒక లీటర్ ఆయిప్ ఫ్రీ లాంటి ఆఫర్లు ఎన్నోఉంటాయి.


డైరీ ఉత్పత్తులు, సాఫ్ట్ డ్రింక్స్  

ఇక డి-మార్ట్‌ లో పాలు, పెరుగు, పన్నీర్, కూల్ డ్రింక్స్ డి-మార్ట్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇటీవలి డైట్ కోక్ టిన్ కేవలం రూ.32కి అందించింది. ఇది సాధారణ మార్కెట్ ధరలతో పోలిస్తే 20% తక్కువ. నాణ్యతపై రాజీ పడకుండా ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడంలో ముందుంటుంది డి-మార్ట్‌.

ప్యాకేజ్డ్ ఫుడ్స్

స్నాక్స్, ఇన్ స్టంట్ ఫుడ్ డి-మార్ట్ లో కావాల్సినంత లభిస్తుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్, బిస్కెట్లు, ఇన్‌ స్టంట్ నూడుల్స్, చిప్స్, రెడీ-టు-కుక్ మీల్స్‌  సహా బోలెడు ఫుడ్స్ ఆకట్టుకునే ధరకే లభిస్తాయి. డి-మార్ట్ బ్రాండెడ్ స్నాక్స్ ప్యాక్‌ను తీసుకున్నా, లే  నూడిల్స్ తీసుకున్నా తక్కువ ధరకే పొందే అవకాశం ఉంటుంది.

పర్సనల్, బేబీ కేర్

షాంపూలు, సబ్బుల నుంచి బేబీ డైపర్లు,  లోషన్ల వరకు, డి-మార్ట్  పర్సనల్, బేబీ కేర్ ఉత్పత్తులను తక్కువ ధరలకే అందిస్తుంది. ఈ వస్తువులపై కనీసం 7% తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

హోమ్,  కిచెన్ ఎసెన్షియల్స్

డి-మార్ట్ లో హోమ్, కిచెన్ కు సంబంధించిన బోలెడు వస్తువులు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి. గృహోపకరణాల క్లీనర్లు, ఫ్లోర్, పాత్రల క్లీనర్లు, డిటర్జెంట్లు, ప్రెషర్ కుక్కర్లు, నాన్-స్టిక్ కుక్వేర్ లాంటి వంటగది ఉపకరణాలు చౌకగా దొరుకుతాయి. ఇస్త్రీలు, ఎలక్ట్రిక్ కెటిల్స్ లాంటి వస్తువులు కూడా తక్కువ ధరలకే లభిస్తాయి.

తాజా పండ్లు, కూరగాయలు

డి-మార్ట్  రెడీ ద్వారా స్థానిక మార్కెట్ల కంటే తక్కువ ధరలో తాజా పండ్లు, కూరగాయలను అందిస్తుంది.

స్టేషనరీ వస్తువులు

డి-మార్ట్ స్టేషనరీ, ఇతర వస్తువులను లైట్ తీసుకోవద్దు. నోట్‌ బుక్‌ లు, పెన్నులు, ఆఫీస్ సామాగ్రి సామాగ్రి అద్భుతమైన డిస్కౌంట్ లో లభిస్తుంది. కనీసం 7% తగ్గింపుతో లభిస్తాయి. బ్యాటరీలు లాంటి యుటిలిటీ వస్తువులు కూడా తక్కువ ధరలకే లభిస్తాయి. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఎక్కువ విలువను పొందేలా చేస్తుంది డి-మార్ట్.

Read Also:  డిమార్ట్‌ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్‌ గా కొనేయొచ్చు?

Related News

Bank Holidays: ఏంటీ ఆ మూడు రోజులు బ్యాంక్ పనిచేయవా.. ముందుగా ప్లాన్ చేసుకోండి ఇలా..

Jio Mart vs D-Mart: రిలయన్స్ ఫ్రెష్, డి-మార్ట్.. దేనిలో ధరలు తక్కువ, ఎందుకు?

Gold Mines: ఆ ప్రాంతంలో లక్షల టన్నుల బంగారం.. తవ్వే కొద్ది బయటపడుతోన్న గోల్డ్.. ఎక్కడో తెలుసా?

Jio Offers: ఎగిరి గంతేసే వార్త.. జియో తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్

PAN 2.0: పాన్ 2.0.. అప్‌డేట్ వెర్షన్, అయితే ఏంటి?

Big Stories

×