Pro Kabaddi League 2025: అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ వచ్చేసింది. క్రికెట్ తర్వాత చాలామంది ప్రో కబడ్డీ లీగ్ చూస్తారు. అయితే కబడ్డీ చూసేవారికి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇవాల్టి నుంచి 12వ సీజన్ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కానుంది. విశాఖపట్నం వేదికగా ప్రో కబడ్డీ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ తో పాటు అన్ని ఏర్పాట్లు ఫిక్స్ చేశారు. ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ లో ( Pro Kabaddi League 2025) భాగంగా తొలి మ్యాచ్ తెలుగు టైటాన్స్ ది కావడం విశేషం. ఇవాళ తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ ( Tamil Thalaivas vs Telugu Titans ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది.
ప్రో కబడ్డీ లీగ్ ( Pro Kabaddi League 2025) షెడ్యూల్ ఇదే
ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ విశాఖపట్నం వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 11 సీజన్లు ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్ లో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 12వ సీజన్ ప్రారంభం అవుతోంది. ఈ 12వ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. మొత్తం నాలుగు వేదికలను ఫైనల్ చేశారు. విశాఖపట్నం, ఢిల్లీ, చెన్నై అలాగే జైపూర్ ( Jaipur) నగరాలలో ప్రో కబడ్డీ 12వ సీజన్ మ్యాచులు కొనసాగుతాయి. ఈ 12వ సీజన్లో మొత్తం 108 మ్యాచ్లు నిర్వహించబోతున్నారు. అయితే ప్లే ఆఫ్ తో పాటు ఫైనల్ వేదికలు ఫైనల్ కాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ రెండు మ్యాచ్లను చెన్నై ( Chennai ) వేదిక గా నిర్వహించే ఛాన్సులు ఉన్నాయి.
ప్రో కబడ్డీ స్ట్రీమింగ్ ఎక్కడంటే
ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ (Pro Kabaddi League 2025 ) స్టార్ స్పోర్ట్స్ 1/ తెలుగు అలాగే జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. అయితే జియో హాట్ స్టార్ సబ్స్క్రైబ్ లు మాత్రమే ఉచితంగా ఈ టోర్నమెంట్ చూసే ఛాన్సులు ఉన్నాయి. ప్రతిరోజు రెండు మ్యాచ్లు రాత్రిపూట నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఆగస్టు 29 అంటే ఇవ్వాలా తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ మ్యాచ్ ఉండనుంది. అలాగే బెంగళూరు బుల్స్ వర్సెస్ పునేరి పల్టాన్ గట్ల మధ్య రాత్రి 9 గంటల సమయంలో మ్యాచ్ ఉంటుంది. ఇలా మొత్తం టోర్నమెంట్ అయిపోయే వరకు కొనసాగనుంది. ఇది ఇలా ఉండగా ప్రో కబడ్డీ 2024 టోర్నమెంట్ సమయంలో హర్యానా స్టీలర్స్… ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన… పాట్నా జట్టును దారుణంగా ఓడించింది. ఈ నేపథ్యంలోనే ప్రో కబడ్డీ టోర్నమెంట్ గెలిచిన తొలి జట్టుగా హర్యానా స్టీలర్స్ రికార్డు సృష్టించింది.
Also Read : CSK Vs RCB : అరేయ్ ఏంట్రా ఇది… గణపతి విగ్రహాలతో CSK vs RCB మ్యాచ్… వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే