OTT Movie : రొమాన్స్, మాఫియా, రివెంజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఒక వెబ్ సిరీస్ ఆకట్టుకుంటోంది. ఈ స్టోరీ షాకింగ్ ట్విస్ట్ లతో కథను ఆసక్తికరంగా నడిపిస్తుంది. ఈ స్టోరీ ఉత్తరప్రదేశ్‌లో ఒక ఇసుక మాఫియా కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఓటీటీలో కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఎందులో ఉందంటే
‘విరోధ్’ (Virodh) 2023లో విడుదలైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. రాహుల్ దహియా డైరెక్ట్ చేసిన ఏడు ఎపిసోడ్‌ల సిరీస్. ప్రతి ఎపిసోడ్ 30-40 నిమిషాల నిడివితో నడుస్తుంది. ఇందులో ప్రీతా బక్షి, అభినవ్ రంగ, ఆశిష్ నెహ్రా, మనోజ్ రాఠీ, గీతాంజలి మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 2023 మార్చి 28 నుంచి MX ప్లేయర్‌లో ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో దీనికి 7.0/10 రేటింగ్ కూడా ఉంది.
కథలోకి వెళ్తే
ఉత్తరప్రదేశ్‌లో తేజా ఫౌజీ కుటుంబం ఇసుక అక్రమ మాఫియాని నడుపుతుంటుంది. ఈ కుటుంబంలో కజ్రీ అనే అమ్మాయి షూటింగ్ విభాగంలో క్రీడాకారిణిగా ఉంటుంది. తన తండ్రి, సోదరుడు రోడ్డు షూటౌట్‌లో హత్యకు గురవడంతో ఆమె జీవితం తలకిందులవుతుంది. తేజా ఫౌజీ మరణంతో, కజ్రీ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి, ఆమె చిన్నాన్న క్రూరమైన మాఫియా లీడర్, ఆమెను స్థానిక రాజకీయ నాయకుడు ధరమ్ సింగ్ కొడుకు విశేష్‌తో పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. కజ్రీ ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి, తన హైస్కూల్ ప్రియుడు గోగి అనే ఒక జావెలిన్ త్రో ఆటగాడితో ఎలోప్ చేస్తుంది. వీళ్లు కలిసి ఒక కొత్త జీవితం కోసం పరిగెత్తుతారు. కానీ గోగి కుటుంబాన్ని బ్రిజ్‌భాన్ హత్య చేస్తూ రివెంజ్ తీర్చుకుంటాడు. దీంతో భయపడిపోయిన కజ్రీ గోగిని కాపాడడానికి విశేష్‌తో పెళ్లికి అంగీకరిస్తుంది.
అయితే పెళ్లి రాత్రి విశేష్‌కు కజ్రీ, గోగి రహస్యంగా కలుస్తున్నట్లు తెలుసుకుంటాడు. ఈ సమయంలో ఒక హింసాత్మక షూటౌట్ జరుగుతుంది. ఇది కథను మరింత గందరగోళంలో పడేస్తుంది. బ్రిజ్‌భాన్, అతని గూండాల నుండి తప్పించుకోవడానికి కజ్రీ, గోగి మళ్ళీ పరుగులు పెడతారు. అదే సమయంలో కజ్రీ తల్లి హేమలత బ్రిజ్‌భాన్ వల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందేమోనని బాధపడుతుంటుంది. ఇప్పుడు కజ్రీ తన ఒలింపిక్ కలను, ప్రేమను కాపాడుకోవడానికి బ్రిజ్‌భాన్‌తో పోరాడాల్సి వస్తుంది. బ్రిజ్‌భాన్‌ను ఈ జంట ఎదిరిస్తుందా ? మాఫియా చేతిలో ఇరుక్కుంటుందా ? ఒలంపిక్ కళలను సాకారం చేసుకుంటారా ? కజ్రీ ఫ్యామిలీని హత్య చేసింది ఎవరు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.
Read Also : ఆడవాళ్ళపై పగబట్టే సీరియల్ కిల్లర్… శవాల చర్మం వలిచి… స్పైన్ చిల్లింగ్ సైకో థ్రిల్లర్