BigTV English

Economic Crisis: సంచుల నిండా డబ్బులు.. రూ.కోటి ఉన్నా ఒక్క బ్రెడ్ ముక్క కూడా కొనలేని దుస్థితి

Economic Crisis: సంచుల నిండా డబ్బులు.. రూ.కోటి ఉన్నా ఒక్క బ్రెడ్ ముక్క కూడా కొనలేని దుస్థితి

జేబునిండా డబ్బులు తీసుకెళ్లినా బయట టీ కూడా కొనలేని పరిస్థితి. బ్యాగు నిండా డబ్బులు తీసుకెళ్లినా కనీసం కోడిగుడ్డు కూడా ఇంటికి కొనుక్కొని వెళ్లలేని దుస్థితి. కూరగాయలు కొనాలంటే ఇంట్లోనుంచి కారునిండా డబ్బుల సంచులు మోసుకెళ్లాలి.
పోనీ కారులో పెట్రోల్ కొట్టించుకోవాలన్నా మరో లారీ నిండా డబ్బులు పెట్రోల్ బంకుకి తీసుకెళ్లాలి.


ఏంటి ఈ దరిద్రం అనుకుంటున్నారా..? ఇప్పటికి సరిగ్గా 111 ఏళ్ల క్రితం మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం ఫలితం ఇది. అయితే అన్ని దేశాలు ఈ ఫలితాన్ని అనుభవించలేదు. అన్నిటికంటే ఎక్కువగా జర్మనీపై ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ ప్రభావం పడింది.

బ్రెడ్ ముక్క వెయ్యి రూపాయలు..


1914లో మొదలైన ఫస్ట్ వరల్డ్ వార్ 1918లో ముగిసింది. జర్మనీ ఈ యుద్ధంలో ఓడిపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలకు పరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. దీంతో జర్మనీ వద్ద నిధులు తగ్గిపోయాయి. ప్రభుత్వం ఒక తెలివితక్కువ పని చేసింది. అత్యధికంగా కరెన్సీని ముద్రించింది. ఈ కరెన్సీ ముద్రణతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. జర్మనీ ప్రజల దగ్గర డబ్బులున్నాయి కానీ కొనడానికి వస్తువులే కరువయ్యాయి. రొట్టె ముక్క వెయ్యి రూపాయలు, కోడి గుడ్డు లక్ష రూపాయలు.. ఇలా తయారైంది పరిస్థితి.

వస్తు మార్పిడి

డబ్బులు ఉంటే ధనవంతుడు, డబ్బులు లేకపోతే పేదవాడు. ఇదీ మనకు తెలిసిన ఆర్థిక సూత్రం. కానీ హైపర్ ఇన్ ఫ్లేషన్ సమయంలో ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ఎంత డబ్బులున్నా ఏదీ కొనలేం. అలాంటప్పుడు ఎంత డబ్బులున్నా అతడు ధనవంతుడు కాడు, కేవలం వస్తువులు ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జర్మనీలో అదే పరిస్థితి ఏర్పడింది. అవసరానికి మించి కరెన్సీ ముద్రించిన ప్రభుత్వం, ప్రజల్ని దరిద్రంలోకి నెట్టింది. పేపర్ కరెన్సీ అస్సలు పనికిరాకుండా పోయింది. బ్యాంకులో దాచుకున్న పొదుపు డబ్బులు కూడా దేనికీ పనికి రాలేదు. డబ్బుకి విలువ లేకపోవడంతో ప్రజలు వస్తుమార్పిడివైపు మొగ్గు చూపారు. తమ వద్ద ఉన్న వస్తవుల్ని అవసరమైన వారికి ఇచ్చి, వారి వద్ద నుంచి తమకు అవసరమైనవి తీసుకునేవారు. ఇలా కొంతకాలం జరిగింది. వస్తు మార్పిడి సత్ఫలితాలను ఇచ్చినా, ఎక్కువకాలం దాని వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం గ్రహించింది. కరెన్సీకి విలువ ఉండాల్సిందేనని, అది మారకంగా పనిచేయాల్సిందేనని తీర్మానించింది. దీంతో కొత్త కరెన్సీ రెంటెన్ మార్క్ తెరపైకి వచ్చింది.

కొత్త కరెన్సీ

1923 నవంబర్ లో జర్మన్ ప్రభుత్వం రెంటెన్‌ మార్క్ అనే కొత్త కరెన్సీని విడుదల చేసింది. మెల్లగా దీనివైపు ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ కొత్త కరెన్సీతో వస్తువుల్ని కొనడం సులభం అయింది. వివిధ కంపెనీలు కూడా జీతాల రూపంలో కొత్త కరెన్సీని ఇచ్చేవి. దీంతో పరిస్థితి కాస్త చక్కబడింది. పాత కరెన్సీ ముద్రణ ఆపేసి, దానికి బదులు కొత్త కరెన్సీని ప్రవేశ పెట్టిన జర్మన్ ప్రభుత్వం కఠినమైన ఆర్థిక నియమాలను అమలు చేసింది. దీంతో హైపర్ ఇన్ ఫ్లేషన్ తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇప్పుడు జర్మనీ ఎలా ఉందంటే..?

అయితే, జర్మనీ అప్పట్లా లేదు. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యింది. నాటి సవాళ్లనుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంది. అప్పటి నుంచి ఆర్థిక అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉంటోంది. మీరు ఒక వేళ జర్మనీ వెళ్తే.. తప్పకుండా ఈ ప్రాంతాలు చూడండి.

జర్మనీలో పర్యాటకుల్ని ఆకర్షించే ముఖ్య ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ఐక్యతకు చిహ్నంగా ఉన్న బెర్లిన్‌ లోని ఐకానిక్ బ్రాండెన్‌ బర్గ్ గేట్. బవేరియాలోని న్యూష్వాన్‌ స్టెయిన్ కోట కూడా జర్మనీలో చూడదగ్గ మరో ప్రదేశం. గోతిక్ టవర్‌లతో నిర్మించిన కొలోన్ కేథడ్రల్ కూడా మనల్ని చూపు తిప్పుకోనివ్వదు. బ్లాక్ ఫారెస్ట్ పర్యటనలో మనం ఎన్నో కొత్త అనుభూతుల్ని మూటగట్టుకుంటాం. మ్యూనిచ్‌లో జరిగే ఆక్టోబర్‌ఫెస్ట్ బీర్ పండుగను చూసి తీరాల్సిందే. రైన్ నది లోయ ప్రాంతంలో కోటలు, ద్రాక్షతోటలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. బెర్లిన్ వాల్ గ్యాలరీ జర్మనీకి మరో ప్రధాన ఆకర్షణ. హైడెల్‌బర్గ్ కోటలో ఉండే రొమాంటిక్ ఫీల్ ని కపుల్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

Also Read: అమెరికా రైళ్ల కంటే మన వందే భారత్ బెటర్.. అక్కడి రైళ్ల స్పీడ్ ఎంతంటే?

జర్మనీ ఆర్థిక వ్యవస్థ..

ప్రస్తుతం జర్మనీ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థిరమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా కాగా, ఆ తర్వాత స్థానం చైనాది. మూడో స్థానంలో జర్మనీ ఉంది. ఇటీవలే భారత్ ఐదో స్థానంనుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జీరోగా మారిన జర్మనీ క్రమక్రమంగా తన పరిస్థితి మెరుగుపరచుకుంది. క్రమశిక్షణతో ముందడుగు వేసి ఏకంగా ప్రపంచంలోనే మూడో స్థానానికి ఎగబాకింది.

Related News

Trains Cancelled: రైల్వే షాకింగ్ డెసిషన్, ఏకంగా 100 రైళ్లు రద్దు!

Railway Robberies: ఫస్ట్ ఏసీ కోచ్‌లోకి దూరి మరీ.. రెచ్చిపోయిన దొంగలు!

Train Cancelled: వైజాగ్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఆ రూట్ లో రైలు సర్వీసులు బంద్!

Indian Railways: అరే బాబూ.. అది రైల్వే టాయిలెట్.. ఓయో రూమ్ కాదు రా!

Magnetic Hill: ఇక్కడ వాహనాలు వాటికవే కదులుతాయి.. ఈ వింత ప్రదేశంపై పరిశోధకులు ఏం చెప్పారంటే?

Indian Railways: ప్రయాణికులపై రైల్వే బాదుడు.. విమానాల తరహాలో కొత్త రూల్స్, ఎందుకు?

Big Stories

×