DMart Low Prices: డిమార్ట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తక్కువ ధర, మంచి క్వాలిటీలో వస్తువులను అందించడంలో ముందుంటుంది.అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ రన్ చేస్తున్న డిమార్ట్, తక్కువ ధరలకు అన్ని రకాల వస్తువులను అమ్ముతూ దేశంలోనే బాగా ప్రసిద్ధి చెందింది. కిరాణా సామాన్ల నుంచి గృహోపకరణాల వరకు, డిమార్ట్ కోట్లాది మంది వినియోగదారులను ఆకర్షించే సూపర్ డీల్స్ ను అందిస్తుంది. అయితే, ఇతర సంస్థలో పోల్చితే డిమార్ట్ లో అంత తక్కువ ధరలకు ఎలా అమ్ముతారు? అనేది తెలియాలి అంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే!
నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు
డిమార్ట్ లో వస్తువులు తక్కువ ధరకు లభించడానికి కారణం నేరుగా తయారీదారుల నుంచి లేదంటే పెద్ద సప్లయర్స్ నుంచి కొనుగోలు చేస్తుంది. మధ్యవర్తులు లేకపోవడం ద్వారా చౌకైన ధరలకు వస్తువులను కొనుగోలు చేస్తారు. డిమార్ట్ పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేస్తుంది కాబట్టి ధర కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకేసారి టన్నుల కొద్ది చక్కెర, వేల లీటటర్ల నూనెలు తీసుకుంటారు. సాధారణంగానే తక్కువ ధరకు లభిస్తాయి.
డబ్బు వృథా చేయకుండా స్టోర్లు నడపడం
డిమార్ట్ ఖర్చు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. డబ్బును ఎలా ఆదా చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ దుకాణాలను కలిగి ఉండటం: ఇతర సంస్థల మాదిరిగా చిన్న దుకాణాలను అద్దెకు తీసుకునే బదులు, డిమార్ట్ పెద్ద దుకాణాలను అద్దెకు తీసుకుంటుంది. ఇది దీర్ఘకాలంలో అద్దెకు డబ్బు ఆదా చేస్తుంది.
⦿ తక్కువ మంది రెగ్యులర్ వర్కర్స్: మార్చి 2024 నాటికి, డిమార్ట్ లో 13,971 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. 59,961 మంది తాత్కాలిక వర్కర్లు ఉన్నారు. తాత్కాలిక కార్మికులతో ఖర్చు తక్కువగా ఉంటుంది.
⦿ స్మార్ట్ స్టోర్ డిజైన్: డిమార్ట్ స్టోర్లు సింపుల్ గా ఉంటాయి. అదనపు అలంకరణలు ఉంటాయి. అదనపు హంగులు లేకుండా క్వాలిటీ వస్తువులను అందించడంలో దృష్టిపెడతారు. ఇది అదనపు ఖర్చులను తగ్గిస్తుంది.
బిగ్ స్కేల్, బిగ్ సేవింగ్స్
ప్రస్తుతం డిమార్ట్ దేశంలోని 12 రాష్ట్రాలలో 415 స్టోర్లను కలిగి ఉంది. ఈ సంస్థ భారీ మొత్తంలో ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో పాటు అమ్ముతుంది. ట్రక్కుల కొద్దీ సబ్బులు, బియ్యాన్ని ఆర్డర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల తక్కువ ధరలకు లభిస్తాయి.
వేగవంతమైన, చౌకైన డెలివరీ సిస్టమ్
డిమార్ట్ ప్రణాళికాబద్ధమైన సరఫరా లింక్ ను కలిగి ఉంటుంది. వస్తువులను నిల్వ చేయడానికి, వాటిని త్వరగా దుకాణాలకు పంపడానికి సెంట్రల్ గోడౌన్లు ఉపయోగిస్తారు.
తక్కువ ధరలు, ప్రత్యేక డిస్కౌంట్లు
డిమార్ట్ లో తక్కువ ధరలతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తుంది. ఇతర స్టోర్ల మాదిరిగా కాకుండా అప్పుడప్పుడు డిస్కౌంట్లు కాకుండా “ఎవ్రీడే లో ప్రైస్’ (EDLP) అందిస్తుంది. వారి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్, డిమార్ట్ రెడీలో, చాలా ఉత్పత్తులపై ఎమ్మార్పీ నుంచి 7% తగ్గింపును ఇస్తారు.
ప్రజలకు అవసరమైన వాటిని మాత్రమే అమ్మడం!
డిమార్ట్ వస్తువులను నిల్వ చేసేందుకు ఇష్టపడదు. కిరాణా సామాన్లు, సబ్బులు, ప్రజలు తరచుగా కొనుగోలు చేసే గృహోపకరణాలు లాంటి ముఖ్యమైన వస్తువులపై దృష్టి పెడతారు. తక్కువ, అధిక డిమాండ్ ఉన్న వస్తువులను విడగొట్టి, త్వరగా అమ్ముడుపోని వస్తువులను నిల్వ చేసే ఖర్చును నివారిస్తుంది.
లాభాలను తెలివిగా ఉపయోగించడం
డిమార్ట్ మంచి లాభాలను సాధించినప్పటికీ,(2025లో రూ.2,707 కోట్ల ఆదాయం) వాటాదారులకు డివిడెండ్ చెల్లించరు. దానికి బదులుగా వారు కొత్త స్టోర్లను తెరవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఉపయోగిస్తారు.
డిమాండ్ లో మరింత డబ్బును ఆదా చేసుకోండిలా!
డిమార్ట్ లో బెస్ట్ డీల్స్ పొందే అవకాశం ఉంటుంది. అదనపు డిస్కౌంట్ల కోసం ప్రత్యేక ఆఫర్లు ఉన్న రోజులలో షాపింగ్ చేయాలి. క్యాష్ బ్యాక్ డీల్స్ తో క్రెడిట్, డెబిట్ కార్డ్ లను ఉపయోగించండి. తాజా ఆఫర్ల కోసం, వారి వెబ్ సైట్ లేదంటే యాప్ ను చూడండి.
Read Also: అమ్మాయికి అచ్చుగుద్దినట్లు తండ్రి పోలికలు.. అదెలా సాధ్యం?