BigTV English

Potato Birth: ఏంటీ? బంగాళ దుంప తల్లి.. టమోటానా? శాస్త్రవేత్తల మైండ్ బ్లోయింగ్ డిస్కవరీ!

Potato Birth: ఏంటీ? బంగాళ దుంప తల్లి.. టమోటానా? శాస్త్రవేత్తల మైండ్ బ్లోయింగ్ డిస్కవరీ!

మీకు బంగాళ దుంపలు ఇష్టమా? టమోటాలు ఇష్టం లేదా? అయితే, మీరు తప్పకుండా ఆలు గడ్డల పూర్వికులు ఎవరో తెలుసుకోవాలి. ఇన్నాళ్లూ అవి ‘దుంప’ ఫ్యామిలీ అని అంతా అనుకుంటున్నాం. కానీ, దానికి జన్మనిచ్చింది టమోటా. వినడానికి.. చదవడానికి చిత్రంగా ఉన్నా.. శాస్త్రవేత్తలు చెప్పారు కాబట్టి.. గుండె ధైర్యం తెచ్చుకుని ఈ నిజాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. అదెలా అని సందేహంగా చూస్తున్నారా? రండి.. దాని ఫ్లాష్ బ్యాక్‌లోకి ఒకసారి తొంగి చూద్దాం.


లాంగ్ లాంగ్.. ఎగో…

సుమారు 9 మిలియన్ ఏళ్ల కిందట జరిగిన ఓ ఘటనే.. బంగాళ దుంప ఆవిష్కరణకు కారణమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అప్పట్లో జరిగిన ‘జన్యు’ వివాహం వల్లే బంగాళ దుంప పుట్టిందని.. దానికి తల్లి టమోటా అని తేలింది. షెన్‌జెన్‌లోని అగ్రికల్చరల్ జెనోమిక్స్ ఇన్‌స్టిట్యూట్, చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, లాన్‌జౌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.. యూకే, కెనడా శాస్త్రవేత్తల సహకారంతో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. అప్పట్లో టమోటా మొక్క, బంగాళాదుంప లాంటి మొక్క మధ్య సంకరీకరణ జరిపారు. అది సక్సెస్ కావడంతో మనుషులు తినేందుకు అనువైన, పోషకాలు కలిగిన బంగాళ దుంప పుట్టింది.


అలా పుట్టి.. ఇప్పుడు ప్రపంచాన్నే ఏలుతోంది

ఇంట్లో బంగాళ దుంప ఉంటే.. ఎన్ని రకాల వంటకాలైనా చేసుకోవచ్చు. స్నాక్స్‌గా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. అందుకే, ఇప్పుడు బంగాళ దుంప ప్రపంచంలో ఎక్కువగా పండించే మూడో పంటగా గుర్తింపు పొందింది. వాస్తవానికి బంగాళ దుంప దక్షిణ అమెరికాకు చెందినది. మంచి పోషకాలు కలిగిన దుంపగా ఆలు గడ్డకు ప్రపంచవ్యాప్తంగా డిమాండు పెరిగింది. చాలావరకు దేశాలు దక్షిణ అమెరికా నుంచి వాటిని దిగుమతి చేసుకొనేవి. అయితే, బంగాళ దుంపలు ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతాయి. దీంతో ఆయా దేశాల్లో వాటిని స్వయంగా సాగు చెయ్యడం మొదలుపెట్టాయి.

బంగాళ దుంపపై ఎందుకు సందేహాలు..

అంత రుచికరమైన బంగాళ దుంప మూలాలు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి వల్లే దాని బండారం బయటపడింది. దాని తల్లి టమోటా అని తెలిసింది. వాస్తవానికి బంగాళ దుంప మొక్క ఎటుబెరోసమ్ అనే జాతికి సమానంగా ఉంటాయి. కానీ, ఫైలోజెనిటిక్ విశ్లేషణలో అవి టమోటాలతో దగ్గర సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది. దీంతో దాని పుట్టుపుర్వోత్తరాలు తెలుసుకోడానికి మరింత లోతైన పరిశోధన చేపట్టారు. ఈ సందర్భంగా 101 జన్యువులను, 349 బంగాళ దుంప నమూనాలను, 56 రకాల బంగాళ దుంప రకానికి చెందిన జాతులను పరిశీలించారు. అంటే దాదాపు దానికి డీఎన్ఏ టెస్టు చేశారు.

Also Read: మద్యం తాగి.. ఖాళీ సీసా ఇస్తే డబ్బు వాపస్.. ప్రభుత్వం కొత్త పాలసీ

ఫలితంగా అది ఎటుబెరోసమ్, టమోటా రెండిటికి చెందిన జాతిగా తేలింది. ఆ రెండిటికి పుట్టిన హైబ్రీడ్ సంతానమే బంగాళ దుంప అని తేల్చేశారు. పరిశోధనలో ఎటుబెరోసమ్‌ను తండ్రిగా.. టమోటాను తల్లిగా పేర్కొన్నారు. అయితే, వీటిది మనుషులు చేసిన పెళ్లి (సంకరీకరణ) కాదు. ప్రకృతి సిద్ధంగా జరిగిన ప్రక్రియ. వివిధ పర్యావరణ ఒత్తిళ్ల వల్ల ఆ జాతుల మధ్య సంకరీకరణ జరిగి.. జన్యు కలిసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆలు గడ్డే తన బిడ్డ అని తెలిస్తే.. ఆ తల్లి (టమోట) ఎంత సంతోషిస్తుందో కదూ!

Tags

Related News

Viral Video: ఈయన దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Viral Video: నడి రోడ్డుపై భర్తను ఉతికి ఆరేసిన భార్య.. పెళ్లికాని ప్రసాదులు మీరు చాలా లక్కీ!

Viral News: పానీ పూరీల కోసం రోడ్డుపై కూర్చోని ధర్నా చేసిన మహిళ.. కారణం తెలిస్తే నవ్వు ఆగదు!

Hyderabad Rains: వానల్లో జనాలకు సాయం.. స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్‌ పై హైదరాబాదీలు ప్రశంసలు!

Chimpanzee: వామ్మో.. చింపాంజీలు ఇంత తాగుబోతులా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

Big Stories

×