OTT Movie : సరికొత్త స్టోరీలతో మలయాళం సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలలో రియలిస్టిక్ కంటెంట్ ఉండటం వల్లే వీటిని చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కేరళలోని కోజికోడ్ నేపథ్యంలో జరుగుతుంది. ఒక వేశ్యతో గడపడానికి వెళ్ళిన వ్యక్తి అనుకోని చిక్కుల్లో పడతాడు. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇది 2012 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో బెస్ట్ స్టోరీ, బెస్ట్ సెకండ్ యాక్టర్ అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మోడరేట్ విజయం సాధించింది. ఈ సినిమా పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
స్టోరీలోకి వెళ్తే
రషీద్ ఈ మధ్యనే గల్ఫ్ నుండి ఇండియాకి తిరిగి వస్తాడు. కోజికోడ్‌లో తన ఖాళీ షాపులో ఒక రాత్రి వేశ్య తో గడపాలని ప్లాన్ చేస్తాడు. సూరజ్ అనే అతని స్నేహితుడు ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఈ ఏర్పాటు చేయడంలో సహాయం చేస్తాడు. కానీ సూరజ్ ఆ షాపు షట్టర్‌ను తెరిచే సమయంలో ఒక పొరపాటు వల్ల రషీద్, వేశ్య లోపల చిక్కుకుంటారు. షట్టర్ తాళం ఎక్కడో పడిపోతుంది. బయట నుంచి సూరజ్ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఊరి జనాలు ఏమనుకుంటారో అనే భయం అతన్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ సమయంలో రషీద్ స్నేహితుడు మనోహరన్ స్థానిక రాజకీయ నాయకుడిగా ఈ గందరగోళంలో చిక్కుకుంటాడు.
ఇప్పుడు రషీద్ జీవితంలో డబుల్ స్టాండర్డ్స్ మొదలవుతుంది. తన కుటుంబం, భార్య, కూతురు పట్ల బాధ్యతలు ఒక వైపు, ఈ రహస్య ఎస్కపేడ్ మరోవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ సమయంలో లోపల చిక్కుకున్న రషీద్, వేశ్య మధ్య జరిగే సంభాషణలు కథకు ఎమోషనల్ డెప్త్ తెసుకొస్తాయి. ఇక బయట, సూరజ్ తన స్నేహితుడిని కాపాడడానికి తాళం తెరవడానికి ప్రయత్నిస్తూ, స్థానిక గుండాలతో డీల్ చేస్తాడు. మనోహరన్ తన స్వంత రాజకీయ, వ్యక్తిగత సమస్యలతో ఈ గందరగోళంలో చిక్కుకుంటాడు. చివరికి ఆ షట్టర్ తెరుచుకుంటుందా ? ఈ విషయం అందరికీ తెలిసిపోతుందా ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ మలయాళ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘షట్టర్’ (Shutter) 2012లో విడుదలైన మలయాళ థ్రిల్లర్ చిత్రం. ఇది జాయ్ మాథ్యూ డైరెక్ట్ చేసిన తొలి చిత్రం. ఇందులో లాల్ (రషీద్), సజిత మాధతిల్ (సెక్స్ వర్కర్), శ్రీనివాసన్ (మనోహరన్), వినయ్ ఫోర్ట్ (సూరజ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2012న జనవరి 26న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం Sun NXT, Manorama Maxలో స్ట్రీమింగ్‌లో ఉంది. IMDbలో 7.7/10 రేటింగ్ ని కూడా పొందింది.
Read Also : ఒకే డాక్టర్ పై ఇద్దరమ్మాయిల ఇంట్రెస్ట్… మెంటలెక్కించే ట్రయాంగిల్ లవ్ స్టోరీ… లాస్ట్ ట్విస్ట్ హైలెట్