BigTV English

Floating Houses: గాల్లో మేడలు.. ఆ మాటను నిజం చేయబోతున్న జపాన్, ఇదిగో ఇలా నిర్మిస్తారట!

Floating Houses: గాల్లో మేడలు.. ఆ మాటను నిజం చేయబోతున్న జపాన్, ఇదిగో ఇలా నిర్మిస్తారట!

ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలతో పోలిస్తే జపాన్లో భూకంపాలు రావడం అనేది సర్వసాధారణమైన విషయం. ఎన్నిసార్లు భూకంపాలు వచ్చినా ఆ నష్టం నుండి జపాన్ త్వరగానే తేరుకొని ముందుకు సాగుతోంది. అయితే భూకంపాలు వచ్చిన ప్రతిసారి ఇల్లు దెబ్బతింటున్నాయి. అందుకే దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టాలని భావించారు జపాన్ సంస్థలు, శాస్త్రవేత్తలు. ఇందుకోసమే ఆ దేశంలోని ఇళ్లను సురక్షితంగా ఉంచడానికి ఒక తెలివైన మార్గాన్ని కనిపెట్టారు. అదే లెవిటేటింగ్ హౌస్ వ్యవస్థ. అంటే భూకంపం వచ్చే ముందు ఇల్లు కొద్దిగా భూమి నుంచి పైకి తేలేలా చేస్తే ఆ భూకంపం తీవ్రత ఇళ్ళను తాకదు.


జపాన్ కు చెందిన ఎయిర్ డాన్సిన్ అనే కంపెనీ భూకంపం సమయంలో ఇల్లు కొద్దిగా తేలేలా చేసే వ్యవస్థను సృష్టించింది. ఈ సాంకేతికత భూకంపం వచ్చినప్పుడు ఇల్లు ఊగడం, గోడలు బీటలు వారడం వంటి నష్టం నుండి బయటపడేస్తుంది. ఇక భూకంపం తీవ్రంగా వస్తే ఇల్లు కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అదే ఇలా గాల్లో తేలిన ఇళ్లల్లో అయితే ఆ తీవ్రత ఏమాత్రం పడదు. దీనివల్ల ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు.

ఇల్లు ఎలా తేలుతాయి?
ఇంటిని కట్టాలంటే ఒక బలమైన కాంక్రీట్ పునాది ఉండాలి. అలాంటి పునాదులు లేకుండా ఇల్లు అవసరమైనప్పుడు గాలిలో తేలేలా కడతారు. దీనికి ఒక వ్యవస్థను సృష్టించింది. దాని ప్రకారం ఇంటి బేస్ కింద ప్రత్యేకమైన ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. భూకంపం లేనప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్ ఫ్లాట్ గానే ఉంటుంది. భూకంపాన్ని కనిపెట్టే సెన్సార్ కూడా ఏర్పాటు చేస్తారు. భూకంపం ప్రారంభమైనప్పుడు ఆ సెన్సార్ వణకడం మొదలవుతుంది. కేవలం ఒక సెకను కంటే తక్కువ సమయంలోనే ఒక యంత్రం ఆ ఎయిర్ బ్యాగ్ ను గాలితో నింపేస్తుంది. ఎయిర్ బ్యాగ్ పూర్తిగా గాలితో నిండాక ఆ ఇల్లు నేల నుండి కొంచెం పైకి లేస్తుంది. దాదాపు ఒక సెంటీమీటర్ నుంచి మూడు సెంటీమీటర్ల వరకు ఇల్లు గాలిలో తేలినట్టు ఉంటుంది. ఆ సమయంలో భూకంపం వచ్చినా, భూమి కనిపించినా కూడా ఇంటిపై ఎలాంటి ప్రభావం ఉండదు. భూకంపం ఆగిపోయిన తర్వాత ఎయిర్ బ్యాగ్ నుండి గాలి బయటకు పోతుంది. ఇల్లు మెల్లగా తిరిగి అదే బేస్ పై కూర్చొంటుంది.


ఇది పనిచేస్తుందా?
కచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పటికే దీన్ని పరీక్షించి చూశారు. 2021లో జపాన్లో 7.3 తీవ్రతతో బలమైన భూకంపం వచ్చింది. లెవిటేటింగ్ వ్యవస్థ ఉన్న ఇల్లు సురక్షితంగా ఉన్నాయి. ఎలాంటి నష్టము జరగలేదు. దాదాపు 30 ఇళ్లకు అప్పటికే ఈ ఎయిర్ బ్యాగులను అమర్చారు. భూకంపం తర్వాత ఈ సాంకేతికత ఉన్న ఆ 30 ఇల్లు బాగానే ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. దీన్ని బట్టి ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని తెలుస్తోంది.

జపాన్లో ప్రతి ఏటా భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. అందుకే ప్రజలకు అక్కడ సురక్షితమైన ఇల్లు అవసరం. ఇళ్లను భూకంప నిరోధకంగా మార్చేందుకు ఎయిర్ డాన్సిన్ కంపెనీ ఈ వ్యవస్థను సృష్టించింది.

ఎంత ఖర్చవుతుంది?
సాధారణ ఇళ్లను ఇలా గాల్లో తేలేటట్టు చేయడానికి అయ్యే ఖర్చు పెద్ద ఎక్కువ ఏమీ కాదు. ఇప్పటికే 200కి పైగా ఇల్లు, కార్యాలయాలు ఈ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాయి. ఇలా ఒక ఇంటిని గాలిలో తేలేలా చేసుకోవడానికి 37 వేల డాలర్లు ఖర్చు పెట్టాలి. అంటే మన రూపాయిల్లో 31 లక్షలు ఖర్చు అవుతుంది.

జపాన్లో ఇంకెన్నో భద్రత సాధనాలు
జపాన్ భూకంపం నుంచి తమ ఇళ్ళను ప్రజలను కాపాడుకోవడానికి ఎన్నో రకాల భద్రత సాధనాలను ఉపయోగిస్తుంది. కేవలం ఇలా తేలియాడే ఇళ్లపైనే ఆధారపడడం లేదు. ఆ దేశం సీస్మోమీటర్లను ఉపయోగిస్తుంది. భూమి కపించడం లేదా అగ్నిపర్వత కార్యకలాపాలను ఈ యంత్రాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. ఆ యంత్రాలు భూకంపాలు వచ్చే విషయాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేస్తాయి. వారు సురక్షితమైన ప్రదేశానికి వెళ్లేందుకు సమయాన్ని ఇస్తాయి. అందుకే జపాన్ లో ఎన్ని సార్లు భూకంపం వచ్చినా ప్రాణ నష్టం మాత్రం జరగదు.జపాన్ భూంకపాలను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.

ఇప్పుడు లెవిటేటింగ్ హౌస్ అంటే గాలిలో తేలియాడే ఇళ్ల వ్యవస్థ పై జపాన్ ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఇంటిని గాలిలోకి ఎత్తుకొని పోదు. కేవలం భూమి నుంచి కొంత పైకి ఇల్లు ఉండేలా చూస్తుంది. భూకంపం వల్ల కలిగే ప్రభావం ఆ ఇంటి పై పడనివ్వదు. ఆ సమయంలో ఇంట్లో మనుషులు సంతోషంగా ఉండవచ్చు.

భూకంపాల సమయంలో జపాన్ ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ఎయిర్ డాన్సిన్ కంపెనీ కనిపెట్టిన ఈ లెవిటేటింగ్ హౌస్ ఐడియా ఉత్తమమైనదనే చెప్పుకోవాలి. జపాన్ కంపెనీలు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన ప్రజలను రక్షించడానికి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఈ లేవిటేటింగ్ హౌస్ కూడా ఒకటి.

Related News

Flight Passenger: ఫ్లైట్ 14 గంటలు ఆలస్యమైతే బర్గర్ ఇస్తారా? ప్రయాణీకుడికి రూ. 55 వేలు కట్టాల్సిందే!

Bengaluru Woman Cop: యూకే వెళ్లే ఫ్లైట్ మిస్, పోలీసుకు రూ. 2 లక్షల జరిమానా!

IRCTC Tour Packages: డిసెంబర్‌లో కేరళ, కశ్మీర్ ట్రిప్‌కు వెళ్లాలా? అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ!

Longest Passenger Train: ఈ ఒక్క రైలుకే 100 బోగీలు.. 25 ఇంజిన్లు.. ఇది ఎక్కడ నడుస్తోందంటే?

India – Pakistan: భారత్, పాక్ ప్రధాన మంత్రులు ప్రయాణించే విమానాల్లో ఇన్ని తేడాలా? ఏ విమానం గొప్ప?

Traffic Diversions: గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు!

Big Stories

×