3 Planets Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆగష్టు నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెల శని, రాహువు, సూర్యుడితో సహా అనేక గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకుంటాయి. ఆగస్ట్ 16 న సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆగస్టు 5 నుంచి బుధుడు తిరోగమన దశలో సంచరిస్తాడు. ఆగస్టు 26న తిరోగమన బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఆగష్టు 28 న బుధుడు ప్రత్యక్షంగా రాశి మారుతాడు. దీని తర్వాత ఆగస్టు 28న శుక్రుడు కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు.
ఆగస్టులోనే సూర్యుడు, రాహువు, శని స్థానాల మార్పు కారణంగా శుభ కలయిక జరుగుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు, శనితో సంసప్తక యోగం ఏర్పడుతుంది. ఇదే కాకుండా సూర్యుడు రాహువు కలిగి షడష్టక యోగాన్ని కూడా ఏర్పరుస్తున్నారు. గ్రహాల స్థితి కారణంగా నాలుగు రాశుల వారికి చాలా సమస్యలు ఎదురవుతాయి. శని, రాహు, సూర్యుడు ఏ రాశుల వారిలో ఒత్తిడిని పెంచుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
ఆగస్ట్ నెలలో మేష రాశి వారికి చాలా సమస్యలు ఎదురవుతాయి. ఆగస్టులో సూర్యుడు మూడవ ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది. మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. తీవ్రమైన విషయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. డబ్బుపెట్టుబడి పెట్టాలనుకునేవారు ప్రస్తుతానికి వాయిదా వేయండి. లేకుంటే నష్టం జరుగుతుంది.
కన్య రాశి:
ఆగస్టులో సూర్యుడు కన్యా రాశి యొక్క పన్నెండవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ నెలలో ఏదైనా పని చేయాలి అనుకుంటే చాలా ఆలోచనాత్మకంగా ముందుకు సాగడం మంచిది. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి . డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది. విద్యా సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశముంది. దూర ప్రాంత ప్రయాణికులకు అవకాశాలున్నాయి. కానీ చేసే పనిలో తక్కువగా లాభాలు వస్తాయి.
మకర రాశి:
ఆగస్టు మాసం అంత మంచి ఫలితాలను మకర రాశి వారికి ఇవ్వదు. సూర్యుడు మీ రాశి ఎమిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి జీవితంలో హెచ్చు తగ్గులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వారి పని కూడా పూర్తి కాకముందే చెడిపోతాయి. ధనానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఉద్యోగస్తులకు తమ పనులు ఆలోచనాత్మక కొనసాగించాలి. ఆగస్టు నెలలో శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది.
Also Read: సంకటహర చతుర్థి.. ఈ మంత్రాన్ని పఠిస్తూ గణపతిని పూజిస్తే ఐశ్వర్యం మీ సొంతం
మీన రాశి:
ఆగస్టు నెలలో మీన రాశి వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీన రాశికి చెందిన ఆరవ ఇంట్లో సూర్యడు ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగా దెబ్బతింది. దీని కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. మీరు పనిచేసే రంగంలో అనేక సమస్యలు కూడా ఎదురవుతాయి. మీరు కోర్టు కేసుల్లో చిక్కుకున్నట్లయితే ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)