BigTV English

Ss Rajamouli: పవన్ కళ్యాణ్ సినిమాని కామెంట్ చేసిన రాజమౌళి, వైరల్ అవుతున్న పోస్ట్

Ss Rajamouli: పవన్ కళ్యాణ్ సినిమాని కామెంట్ చేసిన రాజమౌళి, వైరల్ అవుతున్న పోస్ట్

Ss Rajamouli: సోషల్ మీడియా వలన చాలా అపార్ధాలు జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడో పెట్టిన పోస్టులను కొందరు వెతికి మరి తవ్వి తీస్తారు. అలానే జీవితంలో ఎవరు ఏ స్థాయికి వెళ్తారు అని ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళి స్థానం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం రాజమౌళి మాత్రమే పేరు సాధించడం కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు.


 

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి ఒక గుర్తింపు దక్కింది అంటే దానికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి. అయితే రాజమౌళి చాలా మందిని స్టార్ హీరోలను చేశాడు. కానీ ఆల్రెడీ స్టార్ డం ఉన్న హీరోలతో మాత్రం పని చేయలేదు. ప్రస్తుతం మొదటిసారి ఒక స్టార్ హీరోని డీల్ చేస్తున్నాడు రాజమౌళి.


పవన్ సినిమాపై కామెంట్స్ 

ఇప్పుడు రాజమౌళి తన పనుల్లో బిజీ అయిపోయారు. కానీ ఒకప్పుడు రాజమౌళి మాత్రం నెటిజనులకు సమాధానం ఇచ్చేవాళ్ళు. ఎస్ ఎస్ రాజమౌళి ట్విట్టర్లో అప్పట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఒక నెటిజన్ రాజమౌళిని ట్యాగ్ చేస్తూ మీతో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సినిమా చేయడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు, ఐటెం సాంగ్స్ ఉండవు అంటూ ఒక వ్యక్తి ట్విట్టర్ వేదికగా అప్పట్లో రాసుకు వచ్చాడు.

దానికి రాజమౌళి స్పందిస్తూ మీరు చెప్పింది నిజమే బ్రదర్. అది కూడా కరెక్ట్ కావచ్చు. కానీ వీటన్నిటి మధ్యలో బంగారం సినిమాలో సుబ్బులు పాట విన్నారా.? అదేంటి భక్తిగీతమా అంటూ ఆ నెటిజన్ కు సమాధానం ఇచ్చాడు రాజమౌళి.

అదే హీరోలతో పని చేస్తారు 

ఒకప్పుడు ఎస్ఎస్ రాజమౌళి మీద ఒక కంప్లైంట్ ఉండేది. రాజమౌళి పనిచేసిన హీరోలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పనిచేయరు అని, అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేసిన హీరోలతో రాజమౌళి పనిచేయరు అని అప్పట్లో కామెంట్స్ వినిపిస్తూ ఉండేవి. అంతేకాకుండా ఎన్టీఆర్ తో రాజమౌళి ఎక్కువ సినిమాలు చేయడం వలన కేవలం అదే హీరోలతో పని చేస్తాడని కూడా అప్పట్లో కామెంట్స్ వినిపించేవి. కానీ ఆ లెక్కలన్నీ ఇప్పుడు మారిపోయాయి. రాజమౌళి హీరో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేస్తున్నారు. కాంబినేషన్ కుదరాలే కానీ ఎవరితో ఎవరైనా సినిమా చేయొచ్చు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read: MOWGLI : మొగ్లీ సినిమా కోసం రామ్ చరణ్, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు

Related News

MOWGLI : మొగ్లీ సినిమా కోసం రామ్ చరణ్, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు

Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. దుమారం రేపుతున్న మనోజ్ కామెంట్స్!

DUDE First Gear: డ్యూడ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది, ఎక్సలెంట్ ఎనర్జీ

OG Film Story: ఓజి సినిమా కంప్లీట్ కథ ఇదే, హే సుజీత్ ఈ మాత్రం చాలయ్యా 

Kamalini Mukherjee : నాగార్జున సూపర్ హాట్.. హీరోయిన్ ఇలా అనేసిందేంటీ భయ్యా

Big Stories

×