OTT Movie : ఢిల్లీ వంటి నగరాల్లో రాత్రిపూట క్రైమ్ ఎలా వుంటుందో గతంలో జరిగిన సంఘటనలను చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇలాంటి క్రైమ్ లు పోలీసులకు కూడా ఒక సవాలుగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక సిరీస్ సస్పెన్స్, ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకుంటోంది. ఇద్దరు పోలీసుల చుట్టూ ఈ స్టోరీతిరుగుతూ, అమ్మాయిల మిస్సింగ్ తో ఉత్కంఠభరితంగా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
ఢిల్లీ నగరంలో రుద్ర సేన్‌గుప్తా, అరుణ్ మాథుర్ అనే ఇద్దరు పోలీసులు రాత్రి షిఫ్ట్‌లో పెట్రోలింగ్ చేస్తుంటారు. రుద్ర ఒక కఠినమైన సీనియర్ పోలీస్, తన కోపాన్ని గతంలోని బాధలను కంట్రోల్ చేయలేక సతమతమవుతుంటాడు. అరుణ్ కొత్తగా జాయిన్ అయిన ఆఫీసర్. నగరంలోని క్రైమ్‌లను చూసి నీతిపై నమ్మకం కోల్పోతాడు. నైనా అనే ఒక జర్నలిస్ట్, వీళ్లతో కలిసి ఢిల్లీలోని ఒక కిడ్నాప్ కేసును ఛేదిస్తూ, క్రైమ్‌ల వెనుక ఉన్న పెద్ద కుట్రను బయటపెడుతుంది. ఈ కథ ఢిల్లీ రాత్రుల్లో జరిగే హింస, భయం, అవినీతిని చూపిస్తూ, పోలీసుల మానసిక ఒత్తిడిని ఫస్ట్-పర్సన్ నరేషన్‌తో వివరిస్తుంది.
ఈ ముగ్గురూ కిడ్నాప్ కేసును ఛేదిస్తూ, ఢిల్లీలోని అండర్‌వరల్డ్, అవినీతి రాజకీయ నాయకులతో లింక్‌ను కనిపెడతారు. రుద్రకి తన గతంలో ఒక విషాద సంఘటన జరుగుతుంది. అతని సిస్టర్ కూడా కిడ్నాపర్ కి గురవుతుంది. ఈ సంఘటన వల్ల తన కోపాన్ని అదుపు చేయలేక, కేసును పర్సనల్‌గా తీసుకుంటాడు. అరుణ్ పోలీసు వ్యవస్థలోని అవినీతిని చూసి నిరాశలో మునిగిపోతాడు. కానీ నైనా సపోర్ట్‌తో కేసును సాల్వ్ చేయడానికి పట్టుదలగా ముందుకు సాగుతాడు. కథలో హాసిమ్ అనే ఒక క్రిమినల్, ఈ కేసుకు కీలకంగా మారుతాడు. అతని బ్యాక్‌స్టోరీ కథకు మరింత డెప్త్ ఇస్తుంది. ఈ సినిమా ఢిల్లీ రాత్రుల నేపథ్యంలో సస్పెన్స్, ఎమోషనల్ డ్రామాతో నడుస్తూ, చివర్లో ఒక షాకింగ్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. మరి వీళ్ళు కిడ్నాపర్లను పట్టుకుంటారా ? అమ్మాయిలను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు ? దీని వెనక ఎవరున్నారు ? రుద్ర సిస్టర్ ఏమవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.
ఎందులో ఉందంటే
‘కాండ్’ 2019లో రిలీజైన హిందీ థ్రిల్లర్ మూవీ. ఆకర్ష్ ఖురానా డైరెక్ట్ చేయగా, లిషా బజాజ్, శుభ్రజ్యోతి బరత్, అభయ్ జోషి, నిధి సింగ్ నటించారు. 2019 నవంబర్ 13న ZEE5లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా, IMDbలో 5.5/10 రేటింగ్ పొందింది.
Read Also : శపించబడిన మాన్షన్‌లో షూటింగ్… ఈవిల్ డెడ్ ను మించిన డేంజర్ సీన్లు… ఈ మూవీ ఏంటి భయ్యా ఇంత బ్రూటల్ గా ఉంది?