Suma Kanakala: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అంటే అందరికీ టక్కున సుమ కనకాల(Suma Kanakala) పేరు గుర్తుకు వస్తుంది. ఈమె మలయాళ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ఎలాంటి తప్పులు లేకుండా తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ తన మాట తీరుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కెరియర్ పరంగా ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమా ఈవెంట్లు ఇంటర్వ్యూలు అంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే షూటింగ్ లొకేషన్ లో కూడా ఈమె తన టీం తో కలిసి ఎంతో ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు.
అన్ ప్రొఫెషనల్ డాన్సర్ రమేష్..
ఇకపోతే సుమ డాన్స్ చేయాలని చాలా తపన పడుతుంది కానీ తనకు సరిగా డాన్స్ రాదని ఎన్నో సందర్భాలలో తెలియచేశారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో తరచూ తన టీం తో కలిసి ట్రెండింగ్ లో ఉన్న పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేస్తుంటారు. అయితే సుమా టీంలో అన్ ప్రొఫెషనల్ డాన్సర్ రమేష్ (Ramesh)అనే వ్యక్తి భారీగా ఫేమస్ ఆయన సంగతి తెలిసిందే. ఈయనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా రమేష్ పుట్టినరోజు(Birthday) కావడంతో సుమ తనకు తెలియకుండా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు తన టీమ్ అందరినీ డోర్ వెనక దాక్కొని ఉండమని రమేష్ అనే వ్యక్తిని లోపలికి పిలిచారు అయితే అతను లోపలికి రాగానే ఒక్కసారిగా అందరూ హ్యాపీ బర్త్డే అంటూ గట్టిగా అరవడంతో రమేష్ భయపడిపోయారు.
సుమ మంచి మనసు..
ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా డాన్స్ చేస్తూనే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అందరి సమక్షంలో రమేష్ చేత సుమ కేక్ కట్ చేయించి తన బర్త్డే సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. పాపం సుమక్క.. పుట్టినరోజున అంతలా భయపెట్టావే అంటూ కొంతమంది కామెంట్లు చేయగా… మరి కొంతమంది మాత్రం అసిస్టెంట్ కి కూడా ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ చేయడంతో సుమా మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
?igsh=YzVueGxsY3IxNGlv
తన డాన్స్ ద్వారా రమేష్ ఎంతో ఫేమస్ అవడంతో ఆయన పుట్టినరోజు అనే విషయం తెలిసిన అభిమానులు తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.. ఇక సుమ కెరియర్ విషయానికి వస్తే ఈమె యాంకర్ గా ప్రస్తుతం వరుస సినిమా ఈ వెంట చేస్తూ బిజీగా ఉన్నారు.. ఏదైనా ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతోంది అంటే టీజర్ లాంచ్ కార్యక్రమం నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ వరకు ఆ వేడుకలో సుమా కనకాల సందడి చేయాల్సిందే. ఇలా నిత్యం సినిమా ఈవెంట్లతో బిజీగా ఉన్న ఈమె ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలను పూర్తిగా తగ్గించారు. ఇలా ఈవెంట్లతో పాటు ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ అంటూ తనకు సంబంధించిన విషయాలను కూడా అందరితో పంచుకుంటున్నారు.
Also Read: Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. దుమారం రేపుతున్న మనోజ్ కామెంట్స్!