DUDE First Gear: తెలుగు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన చాలామంది దర్శకులు ఉన్నారు. అయితే ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మల్టీ టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. ఉదాహరణకు విశ్వక్సేన్ విషయానికొస్తే, ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క దర్శకత్వం కూడా చేస్తుంటాడు. అయితే ఇప్పటివరకు విశ్వక్సేన్ తన సినిమాలకు మాత్రమే డైరెక్షన్ చేశాడు. ఇక సిద్దు జొన్నలగడ్డ తన సినిమాలకు కథ , స్క్రీన్ ప్లే రాస్తాడు. మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా రైటింగ్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు.
ఇక తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే షార్ట్ ఫిలిమ్స్ తో ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని కోమాలి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాథన్. కోమాలి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తరువాత చేసిన లవ్ టు డే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే పేరుతో తెలుగులో దిల్ రాజు ఆ సినిమాను డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులో కూడా ఆ సినిమా మంచి సక్సెస్ సాధించి మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఇక్కడితో ప్రదీప్ కు తెలుగులో కూడా మంచి గుర్తింపు లభించింది.
డ్యూడ్ ఫస్ట్ సాంగ్ అవుట్
ఇక ప్రదీప్ రంగనాథన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయాడు. రీసెంట్గా తాను చేసిన డ్రాగన్ సినిమా కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్యూడ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేసింది చిత్ర యూనిట్. సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్ లో మంచి ఎనర్జీ ఉంది. అదే ఎనర్జీ ని ప్రదీప్ రంగనాథన్ మ్యాచ్ చేశాడు. ప్రదీప్ సరసన ఈ సినిమాలో మమిత బైజు నటిస్తుంది. ఈమె ప్రేమలు సినిమాతో మంచి గుర్తింపు సాధించుకుంది.
తెలుగు తమిళ భాషల్లో
ప్రదీప్ కు తమిళ్లో మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. సినిమాకి సంబంధించి రెండు భాషల్లోనూ పాట విడుదలైంది. ఈ సినిమాకు సాయి అభయంకర్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో కీర్తిశ్వరన్ దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ పాటలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకు నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే అక్టోబర్ 17 వరకు ఎదురు చూడక తప్పదు.
Also Read: OG Film Story: ఓజి సినిమా కంప్లీట్ కథ ఇదే, హే సుజీత్ ఈ మాత్రం చాలయ్యా