BigTV English

Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. దుమారం రేపుతున్న మనోజ్ కామెంట్స్!

Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. దుమారం రేపుతున్న మనోజ్ కామెంట్స్!

Manchu Manoj: మంచు మనోజ్ (Manchu Manoj)ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు తర్వాత మంచు మనోజ్ ఇటీవల భైరవం (Bhairavam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక త్వరలోనే మిరాయ్(Mirai) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం వరుస ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


మీ గుండె వందేళ్లు బ్రతకాలి..

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad)గురించి అలాగే ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మనోజ్ విశ్వప్రసాద్ గురించి మాట్లాడుతూ… నిర్మాతగా ఆయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొనే నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది విశ్వప్రసాద్ గారు మాత్రం సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ కూడా చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మీలాంటి గుండె వంద సంవత్సరాలు బ్రతకాలి సార్ అంటూ మనోజ్ మాట్లాడారు.


ఇండస్ట్రీలో తిమింగలాలు ఉంటాయి..

సినిమా ఇండస్ట్రీలో తిమింగలాలు ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే కానీ విశ్వప్రసాద్ గారు మాత్రం తిమింగలాలకు దొరకకుండా రివర్స్ అటాక్ చేస్తూ తన సినిమా కోసం నిలబడ్డారని తెలిపారు. హనుమన్ సినిమా తర్వాత మిరాయ్ సినిమా కోసం తేజసజ్జ (Teja Sajja)ను నన్ను, డైరెక్టర్ కార్తీక్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమా కోసం ఆయన ముందుండి ఎన్ని అడ్డంకులు వచ్చిన సినిమాని ముందుకు నడిపిస్తున్నారని మనోజ్ ఈ సందర్భంగా నిర్మాత గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

విలన్ పాత్రలో మనోజ్…

ఇలా నిర్మాత గురించి గొప్పగా చెప్పిన మనోజ్ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉంటారు అంటూ మాట్లాడటంతో అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆ తిమింగలాలు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది. అలాంటి ఒక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు..ఇండస్ట్రీలో ఒకరి సక్సెస్ కోసం మరొకరిని తొక్కేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఉద్దేశించే మనోజ్ ఇలా మాట్లాడారని తెలుస్తుంది. ఏది ఏమైనా మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సినిమాలో మనోజ్ హీరోగా కాకుండా విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Kamalini Mukherjee : నాగార్జున సూపర్ హాట్.. హీరోయిన్ ఇలా అనేసిందేంటీ భయ్యా

Related News

Senior heroines: సీనియర్ హీరోయిన్స్ కి కలిసిరాని రీఎంట్రీ.. మరి కామ్నా సంగతేంటి?

Siddu Jonnalagadda : తెలుసు కదా ట్రైలర్ కు ఎలివేషన్స్. నాగ వంశీ, సుమ ఆసక్తికర ట్విట్స్

Prabhas : నెక్స్ట్ ఇయర్ కు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్, రెండు సినిమాలు సిద్ధం

Akhanda2 Thaandavam : థియేటర్స్ లో శివతాండవం, తమన్ మామూలోడు కాదు

AA 22xA6: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..  ఇండస్ట్రీలోనే రికార్డు!

Director Teja : బుర్ర లేని డైరెక్టర్ లతో పని చేయడం వల్ల నేను డైరెక్టర్ అయ్యాను

Samantha: సమంత ఇంట ప్రత్యేక పూజలు..అదే కారణమా… ఫోటోలు వైరల్!

Devi Sri Prasad: దేవీశ్రీ ఎక్కడ? కొంపదీసి ఇండస్ట్రీ దూరం పెడుతోందా?

Big Stories

×