MOWGLI : షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దర్శకులలో సందీప్ రాజ్ ఒకడు. కలర్ ఫోటో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా విడుదల కాలేదు. డైరెక్ట్ గా ఓటీటీలోకి విడుదలైంది. ఓటీటీ లో విడుదలైన ఈ సినిమా చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత సందీప్ రాజ్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా డైరెక్షన్ చేయలేదు.
ముఖచిత్రం అనే ఒక సినిమాకు కథను అందించాడు. ఈ సినిమాలో విశ్వక్సేన్ ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఇక ప్రస్తుతం రోషన్ కనకాల హీరోగా మోగ్లీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు సందీప్ రాజ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తున్నారు.
మొగ్లీ కోసం చిరుత
మోగ్లీ సినిమా వరల్డ్ ఎలా ఉంటుందో అని ఒక వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియోను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో లాంచ్ చేయించారు. రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఈ వీడియో విడుదల కానుంది. అయితే చిత్ర యూనిట్ రామ్ చరణ్ కలిసిన వీడియో ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో సందీప్ రాజ్ రామ్ చరణ్ తో మాట్లాడుతూ ప్రతిసారి గుర్రాన్ని పట్టుకున్నప్పుడు మీరు మాత్రమే గుర్తొస్తారో అంటూ చెప్పారు. మరోవైపు రోషన్ కనకాల కూడా రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాల్లో చరణ్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడాడు.
ఇంప్రెస్ అయిపోయిన రాంచరణ్
మోగ్లీ సినిమాకి సంబంధించి వీడియో చూపించగానే రామ్ చరణ్ ఇంప్రెస్ అయిపోయారు. చిత్ర యూనిట్ కు చాలా బాగుంది అని అభినందనలు తెలిపారు. అలానే సందీప్ రాజ్ కు సినిమా సినిమాకి ఇంత టైం తీసుకోకూడదు అంటూ మాట్లాడాడు చరణ్. మొత్తానికి ఇలా సందర్భాన్ని బట్టి రామ్ చరణ్ దర్శనం ఇస్తుంటే చరణ్ అభిమానులకు చూడముచ్చటగా అనిపిస్తుంది. నిన్న వినాయక చవితి సందర్భంగా పెద్ది సెట్స్ నుంచి వీడియో విడుదలైంది. ఈరోజు చరణ్ ఇంట్లో మోగ్లీ టీం కలిసింది. రామ్ చరణ్ ను ఆకట్టుకున్న మోగ్లీ వీడియో ప్రేక్షకుల్ని ఎంతలా ఆకట్టుకుంటుందో రేపు తెలుస్తుంది.
IT CANNOT GET BIGGER THAN THIS 🔥
Global Star @AlwaysRamCharan Garu will launch the “THE WORLD OF MOWGLI” to the world ❤🔥
“𝐓𝐇𝐄 𝐖𝐎𝐑𝐋𝐃 𝐎𝐅 𝐌𝐎𝐖𝐆𝐋𝐈” glimpse out tomorrow at 4.05 PM 🔥
A @SandeepRaaaj directorial.
🌟ing @RoshanKanakala & #SakshiMhadolkar
A… pic.twitter.com/LxvHrmGpXn— People Media Factory (@peoplemediafcy) August 28, 2025