E-Paper
Advertisement

Amazon Forest : అమెజాన్ అడవులు.. అంతుచిక్కని రహస్యాలు..?

Amazon Forest : అమెజాన్ అడవులు సౌత్ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. దాదాపు 55లక్షల చదరపు కిలోమీటర్లు విస్తర్ణంలోఉండగా.. 60 శాతం బ్రెజిల్ దేశంలో ఉన్నాయి

Amazon Forest : అమెజాన్ అడవులు.. అంతుచిక్కని రహస్యాలు..?
Advertisement

Amazon Forest : అమెజాన్ అడవులు సౌత్ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. దాదాపు 55 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తర్ణంలో ఉండగా.. 60 శాతం బ్రెజిల్ దేశంలో ఉన్నాయి. అమెజాన్ అడవులు ప్రపంచంలోనే అతిపెద్ద అడవులు. మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్ 20 శాతం వీటి నుంచే వస్తుంది. ఈ అడవుల్లో ఇప్పటికి అంతుచిక్కని రహస్యాలెన్నో దాగున్నాయి. ఇక వేళ అమెజాన్ అడవి ఒక దేశం అయితే ప్రపంచంలోనే 9వ అతిపెద్ద దేశంగా ఉండేది.

అమెజాన్ అడవిలో దట్టమైన చెట్లు విస్తరించి ఉండటంతో కారుచీకట్లు కమ్మేసి ఉంటాయి. సూర్యరశ్మి 2శాతం మాత్రమే భూ భాగంపై పడుతుంది. ఇక్కడే పడే వర్షం నేల మీద చేరడానికి 10 నిమిషాలు పడుతుంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో..!

Advertisement

అమోజాన్ అడవుల్లో 500 ఆటవిక జాతులు ఉన్నాయి. వీటిలో 50 జాతులకు ప్రపంచంతో సంబంధాలు లేవు. మనుషులను కూడా తినేవాళ్లు ఇక్కడ ఉన్నారు. 390 బిలియన్ల చెట్లు, 4 వేల వృక్షజాతులు, 2200 చేప జాతులు, 1200 పక్షిజాతులు, 420 ఉభయచరాలు, 370 సరీసృపాలు నివశిస్తున్నాయి.

ఎన్నో వింతైన, క్రూర జంతువులు కూడ లేకపోలేదు. అనకొండ, జాగ్వార్, ప్యూమా, స్పైడర్ మంకీ, బుల్లెట్ యాంట్స్, పిరాన్హ చేపలు, ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, ఇంకా మరెన్నో గుర్తించలేని వింత జంతువులు ఉన్నాయి.

Advertisement

ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకు. ఈ ఆకు 3 మీటర్ల వెడల్పు, దాదాపు 40 కేజీల బరువు ఉంటుంది.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రివర్ అమెజాన్ ఇక్కడే ఉంది. ఈ అడవుల మధ్య నుంచే ప్రవహిస్తోంది. అమెజాన్ రివర్ ప్రపచంలోని నదుల కన్నా.. ఐదింతలు ఎక్కువ నీరు విడుదల చేస్తుంది. బ్రెజిల్‌లో ఈ నది 4 లక్షల కిలోమీటర్లు ప్రవహిస్తోంది.

అమెజాన్‌లో పెరిగే ఆమెజానియాన్ సీతకోక చిలుకలు తాబేళ్ల కన్నీళ్లు తాగి బతుకుతాయి. ప్రపంచంలోనే అతి పెద్దగా అరిచే టౌకౌన్ అనే పక్షి ఈ అడవిలోనే ఉంది. దీని కూత దాదాపు అర కిలోమీటరు వరకు వినపడుతుంది.

ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే మెడిసిన్స్‌లో దాదాపు 25 శాతం ఈ అడవుల్లో పెరిగే మొక్కలు నుంచే తయారు చేస్తారు. అది కూడా ఇక్కడ ఉన్న చెట్లలో 1 శాతం చెట్లను పరిశోధించి తయారు చేస్తారు. మనం తినే ఆహార పదార్థాలైన కాఫీ, చాక్లెట్, రైస్, అరటి, మిరియాలు, ఆపిల్స్ దాదాపు 80 శాతం పండ్లు, కూరగాయలు ఇక్కడి నుంచే లభిస్తాయి.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×