Jayam Ravi: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో జయం రవి (Jayam Ravi) అలియాస్ రవి మోహన్ (Ravi Mohan)ఒకరు. జయం రవిగా ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన ఈయన ఇటీవల తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చిన అనంతరం అధికారకంగా తన పేరును రవి మోహన్ గా మార్చుకున్నారు. ఇలా తన భార్య నుంచి విడిపోయిన ఈయన తన సినీ ప్రయాణంలో కూడా కొత్త అడుగులు వేశారు. ఇన్ని రోజులపాటు తెరపై నటుడిగా సందడి చేసిన రవి మోహన్ త్వరలోనే దర్శకుడిగా, నిర్మాతగా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈయన ఇటీవల రవి మోహన్ స్టూడియోస్ (Ravi Mohan Studios)గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ప్రారంభమైన రవి మోహన్ స్టూడియోస్..
ఇలా రవి మోహన్ స్టూడియోస్ అంటూ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ఈయన నేడు చెన్నైలో రవి మోహన్ స్టూడియోస్ ఎంతో ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరోలతో పాటు దర్శకులు హాజరై సందడి చేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇలా రవి మోహన్ నిర్మాతగా మారడంతో నటీనటులు అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.నిర్మాణ సంస్థ ప్రారంభం తర్వాత, దర్శకుడు కార్తీక్ యోగితో రవి మోహన్ ‘బ్రో కోడ్'(Bro Code), యోగి బాబుతో దర్శకుడిగా అరంగేట్రం చేయడం గురించి అధికారిక ప్రకటన తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా కెనిషా ఫ్రాన్సిస్..
ఇక రవి మోహన్ నిర్మాతగా మారడం పట్ల తన సంతోషాన్ని కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రవి మోహన్ తన తల్లి అన్నయ్యలతో కలిసి సందడి చేశారు. అలాగే తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ కెనిషా ఫ్రాన్సిస్(Kenisha Francis)పాల్గొనడమే కాకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ తెల్లటి దుస్తులను ధరించి కనిపించడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్ల గురించి వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.రవి మోహన్ ‘బ్రో కోడ్’ రెగ్యులర్ షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.
దేవుడిని మోసం చేయలేవు..
వచ్చే మూడు సంవత్సరాలలో రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్ ద్వారా సుమారు 10 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో రవి మోహన్ ఉన్నారని తెలుస్తోంది. ఇలా ఈయన తన సినీ ప్రయాణంలో కొత్త అడుగులు వేయటంతో అభిమానులు కూడా రవి మోహన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రవి మోహన్ ‘జీనీ’, ‘కారతే బాబు’, ‘పరాశక్తి’ చిత్రాలలో నటిస్తున్నారు. ఇలా ఒక వైపు నటుడిగా ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు దర్శకుడిగా నిర్మాతగా కూడా మారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక నేడు రవి మోహన్ ఈ స్టూడియో ప్రారంభించిన నేపథ్యంలో ఈయన నిన్న తిరుమల ఆలయానికి తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అయితే ఈ ఫోటోలపై తన మాజీ భార్య ఆర్తీ ఘాటుగా స్పందించారు. నువ్వు నన్ను మోసం చేయొచ్చు కానీ దేవున్ని మోసం చేయలేవు అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీని షేర్ చేశారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కొన్ని వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
Also Read: Karthi: ఆ పని మాత్రం అస్సలు చేయను… రజనీకాంత్ సలహా ఇప్పటికి పాటిస్తా: కార్తీ