Jobs in Indian Railway: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఇంటర్, పదో తరగతి, ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, స్టైఫండ్, ముఖ్యమైన తేదీలు, వయస్సు, తదితర వాటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దక్షిణ రైల్వే చెన్నై (SOUTHERN RAILWAY)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3518 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.
మొత్తం వెకెన్సీలు: 3518
విభాగాలు: ఫిట్టర్, వెల్డడర్, పెయింటర్, ఎంఎల్‌టీ, కార్పెంటర్, ఎంఎంవీ, ఎంఎంటీఏం, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మెన్ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టుల – వెకెన్సీలు:
అప్రెంటీస్ – క్యారేజ్ అడ్ వ్యాగన్ వర్క్స్, పెరంబూర్: 1394 పోస్టులు
సెంట్రల్ వర్క్ షాప్, గోల్డెన్ రాక్: 857 పోస్టులు
సిగ్నల్ అండ్ టెలికమ్ వర్క్ షాప్ యూనిట్స్, పొడనూర్: 1267 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్, పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 25
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 26
వయస్సు: 2025 జనవరి 1వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
స్టైఫండ్: నెలకు రూ. 6000 – రూ.7000 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో..
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://sronline.etrpindia.com