Kamal Haasan: లెజెండరీ యాక్టర్, లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Hassan) సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో విభిన్నమైన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న కమల్ హాసన్ గురించి తాజాగా తన కుమార్తె శృతిహాసన్(Shruthi Hassan) ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. శృతిహాసన్ ఇటీవల డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ (Coolie)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఈమె సత్య రాజ్ కుమార్తె పాత్రలో నటించారు.
హీరోయిన్ కోసం బెంగాలీ నేర్చుకున్న కమల్..
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శృతిహాసన్ సత్యరాజ్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సత్యరాజ్ కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ.. కమల్ హాసన్ ఏ విషయాన్నైనా చాలా తొందరగా నేర్చుకుంటారని తెలిపారు. ఇలా సత్యరాజ్ మాట్లాడుతున్న తరుణంలోనే వెంటనే శృతిహాసన్ కల్పించుకొని..అవును నాన్న బెంగాలీ భాషను (Bengali Language) కూడా అలాగే నేర్చుకున్నారు అంటూ అసలు విషయం బయటపెట్టారు. అయితే ఒక నటి కోసమే నాన్న బెంగాలీ నేర్చుకున్నారని శృతిహాసన్ తెలియజేశారు.
నటి అపర్ణ సేన్ కోసమే..
బెంగాలీ ఇండస్ట్రీలో నటిగా దర్శకురాలిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న అపర్ణ సేన్(Aparna Sen) అంటే కమల్ హాసన్ గారికి ఎంతో ఇష్టం అభిమానం ఉండేదట. ఆమె మీద ఇష్టంతోనే తనని ఇంప్రెస్ చేయటానికి ఈయన చాలా తక్కువ సమయంలోనే బెంగాలీ భాషను కూడా నేర్చుకున్నారని శృతిహాసన్ తెలియజేశారు. అపర్ణ సేన్ అంటే ఎంతో ఇష్టమున్న కమల్ హాసన్ తన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేరామ్ సినిమాలో నటి రాణి ముఖర్జీ బెంగాలీ పాత్రకు కూడా అపర్ణ సేన్ అని పేరు పెట్టినట్టు ఈ సందర్భంగా కమల్ హాసన్ బెంగాలీ నేర్చుకోవడం గురించి శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రాజకీయాలలో బిజీగా కమల్ హాసన్..
ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడం కోసమే బెంగాలీ నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కమల్ హాసన్ తరచూ హీరోయిన్ల విషయంలో వార్తల్లో నిలుస్తుంటారు ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇవ్వడం అదేవిధంగా పలువురు హీరోయిన్లతో లివింగ్ రిలేషన్ లో ఉండటం జరిగింది. ఇలా హీరోయిన్ల విషయంలో తరచు వార్తలలో నిలిచే కమల్ హాసన్ తాజాగా మరొక హీరోయిన్ కోసం బెంగాలీ భాష నేర్చుకున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇక కమల్ హాసన్ చివరిగా మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం చేరుకోలేకపోయింది. ప్రస్తుతం కమల్ హాసన్ సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Jani Master: బిగ్ బాస్‌లోకి జానీ మాస్టర్ అసిస్టెంట్… ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే