BigTV English

Karthi: ఆ పని మాత్రం అస్సలు చేయను… రజనీకాంత్ సలహా ఇప్పటికి పాటిస్తా: కార్తీ

Karthi: ఆ పని మాత్రం అస్సలు చేయను… రజనీకాంత్ సలహా ఇప్పటికి పాటిస్తా: కార్తీ

Karthi: సినిమా ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారు కొంత పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోగానే కేవలం హీరోలుగా మాత్రమే కొనసాగకుండా నిర్మాణరంగం(Production) వైపు కూడా అడుగులు వేస్తూ ఉంటారు. ఇలా నిర్మాతలుగా కొనసాగుతూ భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారు. మన సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే. ఇక మరి కొంతమంది హీరోలు మాత్రం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుంటారు. నిర్మాతలుగా కొనసాగడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ(Karthi) ఒకరు.


నిర్మాతగా మారిన నటుడు జయం రవి..

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న కార్తీ ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా కార్తీ జయం రవి(Jayam Ravi) అలియాస్ రవి మోహన్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈయన ఇండస్ట్రీలో కొత్త ప్రయాణం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.. ఈయన తన భార్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత తన పేరును కూడా మార్చుకున్నారు. అయితే ఇదివరకు హీరోగా కొనసాగిన జయం రవి ప్రస్తుతం నిర్మాతగా మారిపోయారు. ఈయన రవి మోహన్ స్టూడియోస్ (Ravi Mohan Studios)అంటూ నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే.


నిర్మాణరంగంలోకి అస్సలు రాను…

తాజాగా ఈ నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి నటుడు కార్తీ అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఇక ఈయనతో పాటు పలువురు కోలీవుడ్ స్టార్ హీరోలతో పాటు దర్శకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో నటుడు కార్తి మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియజేశారు. తాను సినిమాల విషయంలో రజనీకాంత్(Rajinikanth) గారి సలహాలు పాటిస్తున్నానని తెలిపారు. గతంలో తనకు రజనీకాంత్ గారు నిర్మాణ విషయంలో ఒక సలహా ఇచ్చారు. హీరోగా ఎన్ని సినిమాలు చేసినా పర్వాలేదు కానీ నిర్మాణ రంగంలోకి మాత్రం రావద్దని రజనీకాంత్ గారు తెలిపారు.

రజనీకాంత్ సలహాకే కట్టుబడి…

ఇప్పటికీ రజనీకాంత్ గారి సలహాకే తాను కట్టుబడి ఉన్నానని, హీరోగా ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసిన నిర్మాతగా మాత్రం అసలు చేయనని ఈ సందర్భంగా కార్తీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే కార్తీ అన్నయ్య సూర్య మాత్రం ఒక వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. నిర్మాణ విషయంలో కార్తీక్ ఎందుకు మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.. ఇక కార్తీ, జయం రవి కాంబినేషన్లో మణిరత్నం దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించారు. ఇక ప్రస్తుతం కార్తీ మార్షల్ అనే సినిమాతో పాటు ఖైదీ 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Related News

Actress Meena: గీతాంజలి సినిమా మీనా చేయాల్సిందా.. అలా మిస్ చేసుకుందా?

Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్

Chiranjeevi: నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిసిన చిరంజీవి !

Sai Dharam Tej : అల్లు అర్జున్ గురించి సాయి తేజ్ లేటెస్ట్ కామెంట్స్, ఆయన ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు

Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో

K- Ramp Trailer delay : ఈ దర్శక నిర్మాతలు మారరా, ప్రేక్షకులతో ఆడుకోవడమే పని అయిపోయిందా

Silambarasan TR: ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ని పట్టుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఏకంగా శింబు తో సినిమా

‎Raviteja: ఆ డిజాస్టర్ సినిమాలంటే ఇష్టమన్న మాస్ హీరో..ఆ డౌట్ వస్తే సినిమా పోయినట్టేనా?

Big Stories

×