BigTV English

Pakistan Woman: ఇదేం శిక్ష.. యువతిని రేప్ చేసిన వ్యక్తి.. అతడి చెల్లిని బహిరంగంగా రేప్ చేయాలని తీర్పు!

Pakistan Woman: ఇదేం శిక్ష.. యువతిని రేప్ చేసిన వ్యక్తి.. అతడి చెల్లిని బహిరంగంగా రేప్ చేయాలని తీర్పు!

Revenge Rape: మనుషులలో ఒక్కోసారి మానవత్వం చచ్చిపోయిందా? అనే అనుమానం కలుగుతుంది. మనుషులు పశువుల కన్నా హీనంగా ఆలోచిస్తారా? అనే ఆవేదన కలుగుతుంది. నమ్మడం లేదా? అయితే, పాకిస్తాన్ లో జరిగిన ఈ ప్రతీక అత్యాచారం గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! 2017లో జరిగిన ఈ ఘటన అప్పట్లో పాక్తిస్తాన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.


ఇంతకీ అసలు ఏం జరిగింది?

పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌ లోని ముల్తాన్ శివారు ప్రాంతం ముజఫరాబాద్‌ లో జూలై 16, 2017న ఓ అత్యాచారం జరిగింది. 12 ఏళ్ల బాలిక చెరుకు తోటలో గడ్డికోస్తుండగా 17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టకుండా పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. ఈ గొడవను పరిష్కరించడానికి రెండు రోజుల తర్వాత స్థానిక పంచాయతీ పెద్దలతో పాటు గ్రామ పెద్దలు, ఇరు కుటుంబ సభ్యులు సమావేశం అయ్యారు.


సంచలన తీర్పు చెప్పిన పంచాయితీ పెద్దలు

అత్యాచారానికి గురైన బాలికను అత్యాచారం చేసిన బాలుడు పెట్టి చేసుకోవాలని పంచాయితీ పెద్దలు సూచించారు. పెళ్లికి సదరు అమ్మాయి కూడా సరే అని చెప్పింది. కానీ, అబ్బాయి కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పంచాయితీ పెద్దలు సంచలన తీర్పు చెప్పారు. ప్రతీకార అత్యాచారం చేయాలని ఆదేశించారు. అత్యాచారానికి పాల్పడ్డ 17 బాలుడికి 16 ఏళ్ల సోదరి ఉంది. ఆమెపై  అత్యాచారానికి గురైన బాలిక సోదరుడు అత్యాచారం చేయాలని తీర్పు చెప్పారు. ఈ తీర్పు ప్రకారం పంచాయితీ పెద్దలు, గ్రామస్తులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే యువతిని రేప్ చేశాడు బాధితురాలి సోదరుడు. ఈ తీర్పు ఆ ప్రాంతంలో పెద్ద వివాదానికి కారణం అయ్యింది.

ప్రతీకార అత్యాచారంపై బాధితురాలి తల్లి ఫిర్యాదు

ఈ ప్రతీకార అత్యాచారానికి గురైన 16 ఏళ్ల యువతి తల్లి జులై 24, 2017 నాడు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత 12 ఏళ్ల యువతి తల్లి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముజఫరాబాద్ పోలీస్ స్టేషన్‌లో రెండు అత్యాచారాలకు సంబంధించిన  కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు 29 మందిని అరెస్టు చేశారు. వీరిలో పంచాయితీ సభ్యులు, ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు.

కేసును ప్రత్యేకంగా విచారించిన పాక్ సుప్రీంకోర్టు

ఈ కేసును పాకిస్తాన్ సుప్రీం కోర్టు ప్రత్యేకంగా విచారించింది. ప్రధాన న్యాయమూర్తి మియాన్ సాకిబ్ నిసార్ ప్రతీకార అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు. చట్టవిరుద్ధ తీర్పులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇలాంటి తీర్పులు ఇచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మానవ హక్కుల సంఘాలు కూడా ఈ ప్రతీకార అత్యాచార ఘటనపై ఆందోళనలు చేశాయి. ఈ తీర్పు ఇచ్చిన గ్రామ పెద్దలకు చట్ట ప్రకారం కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశాయి. ప్రతీకార అత్యాచార తీర్పు ఇచ్చిన పెద్దలతో పాటు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులకు సుప్రీం కోర్టు అప్పట్లో జైలు శిక్ష విధించింది.

Read Also: ఫుడ్ ఇవ్వడానికి.. మహిళ ఇంటికి వెళ్లిన డెలీవరీ మ్యాన్, ఆమె తలగడపై రక్తంతో రాసింది చూసి..

Related News

Viral Video: మెట్రో స్టేషన్ లో షాక్.. యెల్లో లైన్‌ దాటిన సెక్యూరిటీ.. అదే సమయంలో!

Arunachal pradesh: అరుణాచల్‌‌ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం.. వాహనాలు వెనక్కి, జస్ట్ మిస్ లేకుంటే

China Delivery Man: ఫుడ్ ఇవ్వడానికి.. మహిళ ఇంటికి వెళ్లిన డెలీవరీ మ్యాన్, ఆమె తలగడపై రక్తంతో రాసింది చూసి..

Heavy rains: వర్షం బీభత్సం.. 2 కిమీల మేర ఏర్పడిన భారీ గుంత.. వీడియో వైరల్

Viral Video: తినే కంచాలపై మూత్రం పోసిన పని మనిషి.. వీడియో చూశారా?

Big Stories

×