Sameera Reddy: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమీరా రెడ్డి (Sameera Reddy) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె.. తన గ్రాడ్యుయేషన్ పూర్తవగానే 1996లో గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ ‘ఔర్ ఆహిస్తా’ అనే మ్యూజిక్ వీడియోలో తొలిసారి నటించింది. దీని తర్వాత పలు హిందీ చిత్రాలలో నటించిన ఈమె.. తొలిసారి ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నరసింహుడు’ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న సమీరా రెడ్డి..ఆ తర్వాత జై చిరంజీవా, అశోక్ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టిన ఈమె మళ్లీ.. 2012లో దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. 2013 వరకూ ఇండస్ట్రీలో కొనసాగిన ఈమె మళ్ళీ తెరపై కనిపించలేదు.
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా – సమీరా రెడ్డి
కానీ ఇటీవల ఒక అవార్డ్ ఫంక్షన్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ స్టేజ్ పైనే ఓవర్ లిఫ్టింగ్ చేసి అబ్బురపరిచింది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. దాన్ని భరించలేకపోయాను..అందుకే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా అంటూ ఊహించని కామెంట్స్ చేసింది. మరి సమీరా ఏ కారణం చేత అలాంటి కామెంట్స్ చేసింది.. ? ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? ఎవరు ఆమెను ట్రోల్స్ చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పిల్లలు పుట్టాక 105 కేజీల బరువు పెరిగాను – సమీరా రెడ్డి
ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. “వివాహం జరిగాక కొంత బరువు పెరిగాను. కానీ పిల్లలు పుట్టాక.. శరీరంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పు వల్ల ఏకంగా 105 కేజీలు బరువు పెరిగాను.ఆ సమయంలో ఎదురైన ట్రోలింగ్ నన్ను మరింత బాధించాయి.తట్టుకోలేక పోయాను. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.. ఒక్కప్పుడు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన నేను ఈ మార్పు తట్టుకోలేకపోయాను. అందుకే ఫిట్ గా మారడానికి ప్రయత్నిస్తున్నాను” అంటూ సమీరా రెడ్డి తెలిపారు. మొత్తానికి అయితే పిల్లలు పుట్టాక బరువు పెరగడంతో తాను మరింత ట్రోల్స్ ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది సమీరారెడ్డి.
సమీరా రెడ్డి వైవాహిక జీవితం..
సమీరా రెడ్డి వైవాహిక జీవిత విషయానికి వస్తే.. 2024 జనవరి 21న మహారాష్ట్ర సాంప్రదాయ పద్ధతిలో అక్షయ్ వర్దే అనే ఒక కంపెనీ వ్యవస్థాపకుడిని ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, పాప జన్మించారు. ఇదిలా ఉండగా ప్రముఖ అమెరికన్ టాక్ షో హోస్టెస్ ఓప్రా విన్‌ఫ్రే సమీరాకు వీరాభిమాని కావడంతో .. ఆమె పెళ్లి సందర్భంగా. భారతదేశ పర్యటనలో భాగంగా పెళ్లికి హాజరై ఆమెకు ఒక చీరను బహుమతిగా అందించారు.
also read:Nara Rohit: రివ్యూవర్లను వేడుకుంటున్న నారా రోహిత్.. కాస్త దయ చూపండయ్యా!