Boney Kapoor: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న బోణి కపూర్(Boney Kapoor) ఆస్తి వివాదంలో కోర్టును ఆశ్రయించిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. తన భార్య, దివంగత నటి శ్రీదేవి(Sridevi) ఆస్తులకు సంబంధించిన విషయం పై ఈయన కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలకు కారణమైంది. శ్రీదేవి సినిమా ఇండస్ట్రీలోకి బాలనటిగా అడుగుపెట్టి అనంతరం ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా వరుస భాష చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ భారీ స్థాయిలో ఆస్తులను కూడా పెట్టిన సంగతి తెలిసిందే.
చెన్నై హైకోర్టును ఆశ్రయించిన బోణీ…
ఈ విధంగా శ్రీదేవి వందల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించి ఆకస్మికంగా మరణించడంతో ఈమె మరణాంతరం శ్రీదేవికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా తన భర్త అలాగే తన పిల్లల పేర్లు మీద మార్పిడి చేశారు అయితే ఒక ఆస్తి విషయంలో మాత్రం వివాదం నెలకొంది.1988లో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో శ్రీదేవి కొనుగోలు చేసిన స్థిరాస్తి విషయంలో ముగ్గురు వ్యక్తులు బోణి కపూర్ కు వ్యతిరేకంగా ఉండటమే కాకుండా ఆస్తి తమదే అంటూ అజమాయిషీ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఈయన ఈ ఆస్తికోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఆస్తి వివాదంలో బోణీ కపూర్…
శ్రీదేవి ఈ ఆస్తిని ముదలైర్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. ఈ ఆస్తిని కొనుగోలు చేసే సమయంలో ముదలైర్ కు ఐదుగురు సంతానం ఉన్నారని అయితే వారందరి అంగీకారంతోనే శ్రీదేవి వారి నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేశారని బోణి కపూర్ తెలిపారు. ఇక ఈ ఆస్తిని శ్రీదేవి కొనుగోలు చేసిన తరువాత ముగ్గురు వ్యక్తులు తాము ముదలైర్ రెండో భార్యకు కుమారులము ఈ ఆస్తిపై తమకు కూడా సమాన హక్కు ఉంది అంటూ బోనీ కపూర్ కు ఎదురు తిరగడంతో ఈయన ఏప్రిల్ నెలలోనే ఇదే విషయంపై కోర్టును ఆశ్రయించి కేసు నమోదు చేశారు. తన భార్య శ్రీదేవి కొనుగోలు చేసిన ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం నకిలీ వారసత్వ ధ్రువీకరణ పత్రాలను కూడా తీసుకొచ్చారని ఈయన తన పిటీషన్ లో పేర్కొన్నారు.
శ్రీదేవి వారసురాలిగా జాన్వీ…
ఇలా శ్రీదేవి కొనుగోలు చేసిన ఆస్తి విషయంలో బోనీకపూర్ వివాదాలను ఎదుర్కొంటూ కోర్టు చుట్టూ తిరగడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. మరి ఈ ఆస్తి విషయంలో బోణీ కపూర్ కు ఎలాంటి న్యాయం జరుగుతుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే శ్రీదేవి అకాల మరణం తర్వాత ఆమె వారసురాలుగా తన కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor) ధడక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె సౌత్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఎన్టీఆర్ తో దేవర సినిమా ద్వారా ఫాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Kamal Hassan: ఓర్నీ.. ఆమెని ఇంప్రెస్ చేయడం కోసం కమల్ హాసన్ అంత పని చేశాడా?