Hyderabad: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. కిలోన్నర గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు మహీంద్రా యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు. శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.
గతంలో నైజీరియన్ నిక నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి పలు పబ్ లలో విద్యార్థులు పార్టీలు చేసుకున్నట్టు తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గంజాయి సేవిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీలో విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని తెలంగాణ యాంటీ నార్కోటిక్ అధికారులు తెలిపారు. ఆషార్ జావేద్, గణేష్, శివకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: AAI Jobs: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 976 ఉద్యోగాలు.. మంచి వేతనం, ఎంపికైతే లైఫ్ సెట్
ALSO READ: Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!