BigTV English

Jasmine Jaffar Controversy: ఆలయంలో బిగ్‌బాస్‌ భామ ఇన్‌స్టా రీల్‌.. ఆరు రోజుల ఆలయ శుద్ధి పూజకు ఆదేశం!

Jasmine Jaffar Controversy: ఆలయంలో బిగ్‌బాస్‌ భామ ఇన్‌స్టా రీల్‌.. ఆరు రోజుల ఆలయ శుద్ధి పూజకు ఆదేశం!

Jasmine Jaffar Controversy: గుడిలో ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌ రీల్‌ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆమె వల్ల ఏకంగా ఆలయం మూసేసి ఆరు రోజుల పాటు శుద్ధి కార్యక్రమానికి ఆదేశించారు. ఈ సంఘటన కేరళలోని ప్రముఖ దేవాలయంలో చోటుచేసుకుంది. కొన్ని రోజులు క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్‌, మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ జాస్మిన్‌ జాఫర్‌ గుడిలో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ చేసింది. ఆమె వీడియో వైరల్‌ అవ్వడంతో ఇది ఆలయ కమిటీ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ కమిటీ గుడి శుద్ధికి ఆదేశించింది.


జాస్మిన్ జాఫర్ పై దేవస్థాన కమిటీ ఫైర్

కేరళలోని గురువాయుర్‌ ఆలయంలోని కోలను వద్ద జాస్మిన్‌ జాఫర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ చేసింది. దీనికి తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఆలయ కమిటీ స్పందిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాయంత్రం వరకు దర్శనాలు నిలిపి వేసి ఆలయ శుద్ధికి ఆదేశం తెలిపింది. ఇలా ఆరు రోజుల పాటు ఆలయాన్ని శుద్ధి చేయాలని దేవస్థాన బోర్టు ఆదేశం ఇచ్చింది. ఆలయ శుద్ధి తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించాలని దేవస్థాన బోర్టు నిబంధనలు విధించింది. అన్యమత మహిళైన జాస్మిన్‌ జాఫర్‌ ఆలయంలో రీల్‌ చేసి అపవిత్రం చేసిందని, తనపై చర్యలు తీసుకోవాలని దేవస్థాన బోర్టు పోలీసులను ఆశ్రయించింది.


అది హైకోర్టు ఉల్లంఘన..

అన్యమత మహిళైన సదరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌ నిషేధిత ప్రదేశంలో వీడియో తీసి రికార్డు చేసింది. గుడి కోలను, నడప్పురలో కూడా రీల్‌ చేసింది. పవిత్రమైన కోనేరులో జాస్మిన్‌ తన పాదాలను కడుగుతున్నట్లు వీడియోలో చూపించింది. ఇది అసలు సహించరాని చర్య, ఇది హైకోర్టు ఉల్లంఘన కిందికి వస్తుందని దేవస్థాన కమిటీ తమ ఫిర్యాదులో పేర్కొంది. హిందువులు ఎంతో ప్రవిత్రంగా చూసే కోలను నీటిలో ఆమె పాదాలు కడగం తీవ్రమైన చర్య అని, ఆ కోలనులో ఉత్సవ మూర్తికి స్నానం నిర్వహించేందుకు ఆరట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తారని.. అలాంటి కోలను జాస్మిన్‌ జాఫర్‌ పాదాలు కడగడం అపచారమని దేవస్థాన కమిటీ తమ ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహరం కేరళలో సంచలనంగా మారింది. ఆలయ కమిటీ అభ్యంతరం తెలపడంతో సదరు సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయేన్సర్‌ స్పందించింది. తన రీల్‌ డిలీట్‌ చేసి దేవస్థాన బోర్డును క్షమాపణలు కోరింది.

Also Read: Sundarakanda Movie: నారా వారి మూవీలో మంచు హీరో… ఎక్కడో బంధం కలుస్తుంది

Related News

Kamal Hassan: ఓర్నీ.. ఆమెని ఇంప్రెస్ చేయడం కోసం కమల్ హాసన్ అంత పని చేశాడా?

Brahmanda Movie: నటి ఆమని ప్రధాన పాత్రలో ‘బ్రహ్మాండ’.. ఒగ్గు కథ కళాకారుల నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం..

Jayam Ravi: ఘనంగా జయం రవి స్టూడియోస్ ప్రారంభం… మొదటి సినిమా ప్రకటన!

Karthi: ఆ పని మాత్రం అస్సలు చేయను… రజనీకాంత్ సలహా ఇప్పటికి పాటిస్తా: కార్తీ

Mass Jathara: అనుకున్నదే అయ్యింది.. మాస్ మహారాజా కూడా వెనక్కి తగ్గాడు

Big Stories

×