Brahmanda Movie Pre Release Event: ప్రస్తుతం చిన్న సినిమాలు సైతం పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఓ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వాలంటే భారీ బడ్జెట్, స్టార్ తారగణం ఉండాల్సిన అవసరం లేదని ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. బలగం, కమిటీ కుర్రాళ్లు వంటి సినిమాలు ఏ రేంజ్‌లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంటెంట్ కింగ్ వచ్చిన చిన్న సినిమాలు ఆడియన్స్‌ని విశేషం ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా ఆధ్యాత్మిక కథలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఒకవైపు పెద్ద సినిమాలు ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్నాయో, మరోవైపు చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల హృదయాలను తాకుతున్నాయి.
ఓగ్గు కథ నేపథ్యంలో ‘బ్రహ్మాండ’
ఇక ప్రస్తుతం రాబోతున్న సినిమాలలో ‘బ్రహ్మాండ’ మూవీ ఒకటి. సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా నటి ఆమనితో పాటు దర్శక-నిర్మాతలు ఇతర మూవీ టీం సభ్యులు మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. నటి ఆమని మాట్లాడుతూ.. బ్రహ్మాండ మూవీ తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని ఆమె తెలిపారు. అలానే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలను చెప్పారు నటి ఆమని. ఇంత మంచి సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుకు రాంబాబు మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆమె వాపోయారు.
నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది
హీరో బన్నీ రాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నాది అద్భుతమైన పాత్ర. ఇందులోని నా పాత్ర నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాను శుక్రవారం రిలీజ్ చేయబోతున్నాం. అందరూ చూసి ఆదరించండి. ముఖ్యంగా క్లైమాక్స్‌ని అసలు మిస్ చేయకండి. అద్భుతమైన అనుభూతిని పొందుతారు’ అని చెప్పుకొచ్చాడు. అనంతరం నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ… నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ స్క్రిప్ట్ దశలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా .. అంతకుమించి చిత్రీకరించా చిత్రీకరించాం. మా డైరెక్టర్ ఇప్పుడు మా మధ్య లేకపోవడం బాధకరం. ముఖ్యంగా ఆమని గారు బలగం జయరాం గారు కొమురక్క గార్ల సహకారం మేము మరవలేము అని చెప్పారు . కాగా ఈ చిత్రంలో ఆమనితో పాటు బలగం జయరాం కొమరక్క, బన్నీ రాజు, కనీకా వాధ్య చత్రపతి, శేఖర్, అమిత్, దిల్ రమేష్, ప్రసన్న కుమార్, దేవిశ్రీ కర్తానందం వంటి తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Also Read: Jasmin Jaffar: ఆలయంలో బిగ్‌బాస్ భామ ఇన్‌స్టా రీల్.. ఆరు రోజుల ఆలయ శుద్ధి పూజకు ఆదేశం!