Big Stories

Mouth Wash Effects: మౌత్‌వాష్‌ వాడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

 

- Advertisement -

Mouth Wash Effects: నోరు శుభ్రంగా ఉండేందుకు మార్కెట్లో దొరికే మౌత్ వాష్‌లను ఉపయోగిస్తుంటారు. నోరు శుభ్రంగా ఉండాలని, రోజంతా వాసన రాకుండా తాజాగా ఉండాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తరచూ మౌత్ వాష్ల ను వాడడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

ప్రయోజనాలు :

నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారికి మౌత్ వాష్ లు చాలా బాగా ఉపయోగపడతాయి.
తాజా శ్వాస కోసం మౌత్ వాష్ లను తరచూ వాడటం వల్ల నోటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది.
మౌత్ వాష్‌లలోని యాంటీసెప్టిక్ లక్షణాలు దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
ఫ్లోరైడ్ లతో ఉండే మౌత్ వాష్‌లు టీత్‌ను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
మౌత్ వాష్ లతో నోటిలోని పుండ్లు, చిగుళ్ల వాపు, సమస్యలు వంటివి కూడా నయం అవుతాయి.

నష్టాలు :

మౌత్ వాష్ లను తరచూ వాడడం వల్ల లాలాజలం తగ్గిపోతుంది.
ముఖ్యంగా ఆల్మహాల్ ఉండే మౌత్ వాష్ లను వాడితే నోరు పొడిగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని మౌత్ వాష్ లలో ఉండే రసాయనాలు నోటిలో పుండ్లను తయారయ్యేలా చేస్తాయి.
రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువగా వాడితే ప్రమాదం.
డాక్టర్ల సలహాతో మాత్రమే మౌత్ వాష్ లను ఉపయోగించాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News