Big Stories

Rohit Sharma: అందరూ రోహిత్ దగ్గరికే.. హార్దిక్‌ను పట్టించుకోని బౌలర్లు

IPL 2024: ముంబై జట్టులో గెలుపు ఓటములను పక్కన పెడితే, ఇంకా అక్కడ సమస్యలు సద్దుమణగలేదు. టీమ్ లోపల అంతా గందరగోళం నడుస్తూనే ఉంది. అది పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మళ్లీ బయటపడింది. పంజాబ్ కింగ్స్ కి ఆఖరి ఓవర్ వేయాలి. హార్దిక్ పాండ్యా ఏం చేశాడంటే బాల్ తీసుకువెళ్లి పేసర్ ఆకాశ్ మధ్వాల్‌కి ఇచ్చాడు.

- Advertisement -

అప్పటికి పంజాబ్ ఇంకా 10 పరుగులు చేయాలి. వారి చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. ఈ సమయంలో స్టేడియంలో ఒకటే టెన్షను, అందరూ ఉగ్గబట్టుకుని చూస్తున్నారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో బూమ్రాని కాదని ఆకాశ్ కి ఇవ్వడంపై రకరకాల విమర్శలు వినిపించాయి. సరే, అయిందేదో అయ్యింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది.

- Advertisement -

అదేమిటంటే బాల్ అందుకున్న ఆకాశ్ సరాసరి రోహిత్ దగ్గరికి వెళ్లాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. రోహిత్ కూడా ఫీల్ కాకుండా త్వరత్వరగా తన వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. ఇది చూసిన హార్దిక్ తగదునమ్మా.. అంటూ వారి మధ్యలోకి చేరుకున్నాడు. అయితే ఆకాశ్ మాత్రం పాండ్యాను పట్టించుకోకుండా రోహిత్ ను సలహాలు అడిగాడు.

ఏ బాల్స్ వేయాలి? ఫీల్డింగ్ ఎక్కడ సెట్ చేయాలి? అని అడిగేసరికి రోహిత్ కొన్ని ట్రిక్స్ చెప్పాడు. ఈ బాల్స్ వేయమని చెప్పి, అందుకు తగినట్టుగా ఫీల్డింగ్ సెట్ చేశాడు. అప్పుడు రోహిత్ ఇటువైపు ఫీల్డర్ ని పెడదామని తూర్పు వైపు చేయి చూపిస్తే, పాండ్యా దానికి ఆపోజిట్ గా పడమర వైపు చేయి చూపించాడు. దాంతో ఆకాశ్ ఏం చేశాడంటే, రోహిత్ చెప్పినట్టు తనకి అక్కడే ఫీల్డర్ ఉండాలని చెప్పి బౌలింగు వేయడానికి వెళ్లాడు. దీంతో హార్దిక్ ఆశ్చర్యపోతు అవాక్కయి అలా చూస్తూ ఉండిపోయాడు. రోహిత్ వెంటనే తన ప్లేస్ కి వెళ్లిపోయాడు.

Also Read: పాండ్యాకు షాక్.. రూ.12 లక్షల జరిమానా..

ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ముంబై ఇండియన్స్ పైకి అలా ఉంది కానీ, లోపల నిప్పు రగులుతూనే ఉంది. గెలవడం వల్ల అందరూ నోర్మూసుకుని ఉన్నారని అంటున్నారు. మొత్తానికి హార్దిక్ పాండ్యాకి మాత్రం కెప్టెన్సీ ఒక తలనొప్పి అయితే, జట్టు మాట వినకపోవడం మరో తలనొప్పిగా మారిందని అందరూ అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News