E-Paper
Advertisement

Turmeric For Hair: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారంటీ

Turmeric For Hair: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారంటీ

Turmeric For Hair: పసుపు ప్రతి ఇంట్లో తప్పకుండా ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. అనేక వ్యాధులను నయం చేసే పసుపును జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు.పసుపు జుట్టును ఒత్తుగా, నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా పసుపులో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పసుపును తెల్లజుట్టును నల్లగా మార్చడం కోసం ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పసుపు, పెరుగు:
కావలసినవి:
పెరుగు- 1 కప్పు
పసుపు- 3 టేబుల్ స్పూన్లు

అప్లై చేసే విధానం: ముందుగా 1 కప్పు పెరుగులో 3 టీస్పూన్ పసుపు కలిపి పేస్ట్ చేయండి. దీన్ని మీ జుట్టు మూలాలకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే జుట్టు రంగు మారడంతో పాటు జుట్టు ఒత్తుగా మారుతుంది.

2. పసుపు ,కొబ్బరి నూనె:
కావలసినవి:
కొబ్బరి నూనె- జుట్టుకు సరిపడా
పసుపు- 4-5 టీస్పూన్లు

అప్లై చేసే విధానం: కొబ్బరి నూనెతో పాటు పసుపును పైన చెప్పిన మోతాదులో తీసుకుని ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టు మూలాలకు అప్లై చేసి మసాజ్ చేయండి. 1 గంట తర్వాత మీరు వాడే షాంపూతో తలస్నానం చేయండి.

3. పసుపు, మెహందీ:
కావలసినవి:
మెహందీ – 1 కప్పు
పసుపు పొడి- 1 టేబుల్ స్పూన్
నీరు – తగినంత

అప్లై చేయు విధానం: పైన చెప్పిన మోతాదుల్లో అన్ని పదార్థాలను తీసుకుని ఒక గిన్నెలో వేసి మందపాటి పేస్ట్ తయారు చేయండి. ఆ తర్వాత దీన్ని మీ జుట్టుకు పట్టించి 2-3 గంటలపాటు అలాగే ఉంచాలి. అనంతరం మీరు వాడే షాంపూతో తలస్నానం చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది.

Also Read: కరివేపాకు, మెంతి గింజలతో హెయిర్ ఆయిల్.. జుట్టు పెరగడం గ్యారంటీ

4.పసుపు , ముల్తానీ మిట్టి:
కావలసినవి:
ముల్తానీ మిట్టి- 5-6 బేబుల్ స్పూన్లు
పసుపు పొడి- 2 టీస్పూనలు
నీరు- తగినంత

అప్లై చేయు విధానం: పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్ లో వేసి మిక్స్ చేయండి. ఆ తర్వాత మందపాటి పేస్ట్ తయారు చేయండి. అనంతరందీన్ని మీ జుట్టు మూలాలపై అప్లై చేయండి. 20 నిమిషాల తర్వా తేలికపాటి షాంపూతో కడగాలి. దీనిని తరుచుగా వాడటం వల్ల ఎంతటి తెల్ల జుట్టు అయినా తక్కువ రోజుల్లోనే నల్లగా మారుతుంది. అంతే కాకుండా చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×