E-Paper
Advertisement

Clove Oil : పంటి నొప్పితో బాధపడుతున్నారా.. ఈ వంటింటి చిట్కాలు మీ కోసమే..

Clove Oil : పంటి నొప్పితో బాధపడుతున్నారా.. ఈ వంటింటి చిట్కాలు మీ కోసమే..
Advertisement

Clove Oil : తరచూ చాలా మంది పంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఉదయాన్నే పళ్లు తోడుకునే సమయం నుంచే రోజంతా రకరకాల దంత సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా పిప్పళ్లు, పంటి నొప్పి, దంతాల నుంచి రక్తస్రావం, ఇన్పెక్షన్లు, పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల వాపు, దంతాల్లో పగుళ్లు వంటి రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి వంటింటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో కొన్ని సమస్యలు బయటకు కనిపించకుండానే ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అందులో ముఖ్యంగా పళ్ల సమస్య ఒకటి. పళ్ల సమస్య తలెత్తిందంటే అది శరీరం అంతా సమస్యగా మారుతుంది. ఎందుకంటే పంటి నొప్పితో తరచూ బాధపడుతూ సరిగా ఆహారం తినకుండా ఉండడం వల్ల నిరసానికి గురవుతుంటాం. దీని వల్ల శరీర సమస్యలకు దారితీస్తుంది. అయితే పండ్ల సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదిస్తుంటారు. మరి కొంతమంది తగ్గిపోతుందనే అపోహతో చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఇంట్లో దొరికే లవంగాలను ఔషధంలా వాడుకోవచ్చు.

Advertisement

లవంగాలతో నూనెను తయారుచేసుకుని పంటినొప్పి ఉన్న చోట రాసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లవంగాల నూనెతో యాంటీ ఫంగల్, ఇన్ ఫ్లమేటరీ, బ్యాక్టీరియల్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల లవంగాల నూనెను పంటికి రాయడం వల్ల పంటి ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు చిగుళ్ల సమస్యకు కూడా లవంగాల నూనె అద్భుతంగా పనిచేస్తుంది. నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుంది. అయితే లవంగాల నూనె జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. దూదిని ఉపయోగించి లవంగాల నూనెను నొప్పి ఉన్న చోట రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

Tags

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×