E-Paper
Advertisement

Bandar Halwa: ఇంట్లోనే బందరు హల్వా చేసేయచ్చు, రెసిపీ ఇదిగో

Bandar Halwa: ఇంట్లోనే బందరు హల్వా చేసేయచ్చు, రెసిపీ ఇదిగో
Advertisement

బందర్ హల్వా పేరు వింటేనే నోరూరిపోతుంది. చిన్న ముక్క నోట్లో పెడితే చాలు కరిగిపోయేలా ఉంటుంది. గోధుమ పిండితో చేసే ఈ స్వీటు అదిరిపోతుంది. దీన్ని చేయడం కష్టం అనుకుంటారు కానీ… నిజానికి చాలా సింపుల్ గా వండేయచ్చు. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

బందరు హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి – అర కిలో
బెల్లం – అర కిలో
నెయ్యి – అర కిలో
జీడిపప్పు – యాభై గ్రాములు
యాలకల పొడి – ఒక స్పూను
ఫుడ్ కలర్ (ఎరుపు లేదా నారింజ) – చిటికెడు
నీరు – అవసరమైనంత

Advertisement

బందరు హల్వా రెసిపీ
1. ముందుగా గోధుమపిండిని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. అందులో కొంచెం కొంచెంగా నీరు పోస్తూ ముద్దలా కలపాలి.
2. ఈ ముద్ద గట్టిగా కాకుండా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ ముద్దను ఒక గిన్నెలో వేసి అది మునిగే వరకు నీళ్లు పోసి 6 నుంచి 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. 3. ఇలా నానబెట్టడం వల్ల గోధుమలలోని పాలు బాగా బయటకు వస్తాయి.
4. నానిన తర్వాత గోధుమ ముద్దను చేతులతో బాగా పిసుకుతూ పాలు తీసుకోవాలి. వచ్చిన పాలను వేరే గిన్నెలో వడకట్టాలి.
5. ఇలా రెండు మూడు సార్లు నీరు పోసి పిసికి గోధుమ పాలు పూర్తిగా తీసుకోవాలి.
6. ఆ పాలను కొంతసేపు నిల్వ ఉంచాలి. పై భాగంలో స్వచ్ఛమైన నీరు వేరుపడుతుంది. ఆ నీటిని జాగ్రత్తగా తొలగించాలి.
7. మిగిలిన గోధుమ పాలు హల్వా చేయడానికి ఉపయోగడుతుంది.
8. ముందుగా ఒక మందపాటి అడుగు ఉన్న పాన్ లేదా కడాయిని తీసుకోవాలి.
9. అందులో బెల్లం వేసి, కొద్దిగా నీరు పోసి మంట మీద ఉంచాలి.
10. బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. మరిగిన తర్వాత మలినాలు ఉంటే వడకట్టాలి. ఇప్పుడు బెల్లం పాకం కొద్దిగా చిక్కగా వచ్చే వరకు మరిగించాలి.
11. బెల్లం పాకం సిద్ధమైన తర్వాత మంటను మధ్యస్థంగా ఉంచాలి.
12.ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న గోధుమ పాలను కొంచెం కొంచెంగా పాకంలో పోస్తూ మరో చేతితో కలుపుతూ ఉండాలి.
13. ముద్దలు కట్టకుండా ఉండాలంటే ఈ దశలో కలపడం చాలా అవసరం. గోధుమ పాలు పాకంతో కలిసి నెమ్మదిగా చిక్కబడతాయి.
14. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ చిటికెడు వేసుకోవాలి. తర్వాత బాగా దగ్గరగా అయ్యాక జీడిపప్పులు వేసుకోవాలి.
15. మంట తగ్గించి హల్వాను నిదానంగా ఉడికించాలి. కొంతసేపటికి మిశ్రమం బాగా చిక్కగా మారుతుంది.
16. నెయ్యిని ఒక్కసారిగా కాకుండా, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ప్రతి సారి నెయ్యి వేసినప్పుడు పూర్తిగా కలిసే వరకు కలపాలి.
17. నెయ్యి పూర్తిగా కలిసిపోయి, హల్వా కడాయి గోడల నుంచి వదులుగా విడిపడే వరకు కలుపుతూ ఉడికించాలి.
18. చివరగా యాలుకల పొడి వేసి బాగా కలపాలి. మంట ఆపేసి నెయ్యి రాసిన ప్లేట్ లేదా ట్రేలో హల్వాను పోయాలి. పై భాగాన్ని స్పూన్‌తో సర్దాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే బందరు హల్వా రెడీ అయినట్టే.

వేడుకలు, పండుగల సమయంలో బందరు హల్వా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే దీని రుచి మర్చిపోలేరు. దీన్ని చేయడం కొంచెం కష్టమే కానీ… ఒక్కసారి చేసుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×