E-Paper
Advertisement

Brown Sugar for Skin: పంచదారతో నిగనిగలాడే చర్మం.. ఈ స్క్రబ్స్ ట్రై చేస్తే గ్లో గ్యారంటీ అమ్మాయిలూ!

Brown Sugar for Skin: పంచదారతో నిగనిగలాడే చర్మం.. ఈ స్క్రబ్స్ ట్రై చేస్తే గ్లో గ్యారంటీ అమ్మాయిలూ!
Advertisement

Brown Sugar for Skin: సహజసిద్ధంగా మీ అందాన్ని మెరిపించుకోవాలి అనుకుంటే.. దాని కోసం ఖరీదైన కాస్మెటిక్స్ అక్కర్లేదు. ఇంట్లో ఉన్న చక్కెర చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంతోపాటు మీ శరీరం కోల్పోయిన తేమను నిలిపి ఉంచడంలో ఎంతగానో సహకరిస్తుంది చక్కెర. వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలను చక్కెరతో కలిపి బాడీకి స్క్రబర్స్‌గా వాడితే.. సహజ నిగారింపు మీ సొంతం అవుతుంది. మరి అదెలాగో ఇప్పుడు చూసేద్దామా..

మృతకణాలు తొలగుతాయి:

ముందుగా రెండు టేబుల్‌ స్పూన్ల బ్రౌన్‌షుగర్‌లో సమాన పరిమాణంలో ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ఒంటికి రాసుకోండి. ఆ తర్వాత చక్కెర కరిగేవరకూ మృదువుగా మసాజ్‌ చేస్తూనే ఉండాలి. దీంతో మృతకణాలు పోయి చర్మానికి తగిన రక్తప్రసరణ జరిగి కాంతిమంతంగా మెరుస్తుంది. ఈ విధానాన్ని కనీసం వారానికి ఒకసారైనా పాటిస్తేనే మంచి ఫలితం ఉంటుంది.

తక్షణ నిగారింపు:

Advertisement

ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్‌షుగర్‌ని తీసుకోండి. దీనికి ఒక చెంచా పెసరపిండి, కాసిని పాలు కలిపండి. కాసేపటి తర్వాత ఆ మిశ్రమాన్ని ఒంటికి రాసి స్క్రబ్‌ చేయండి. ఈ ప్రక్రియ తర్వాత చర్మం ఎంత నిగారింపుగా కనిపిస్తుందో మీకే అర్థమౌతుంది.

ఐదు నిమిషాలు చాలు:

అరకప్పు చక్కెరకు రెండు చెంచాల కొబ్బరినూనె, చెంచా తేనె కలిపి చర్మానికి రాసుకోండి. ఆపై 5 నిమిషాల పాటు ఆరనిచ్చి.. చేతులు తడుపుకొంటూ నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు, సూర్యరశ్మి వల్ల ఏర్పడ్డ టాన్ ఇట్టే‌ తొలగిపోతుంది.

మొటిమలు మాయం:

Advertisement

అలాగే చక్కెరలో ఓట్‌మీల్‌, ఆలివ్‌ ఆయిల్‌ కలిపి స్క్రబ్‌ వేసుకుంటే.. జిడ్డు చర్మం, మొటిమలను పూర్తిగా నియంత్రించవచ్చు. ఈ స్క్రబ్ చర్మంలో ఉండే అదనపు నూనెను తొలగించడంతో సహాయపడుతుంది. అంతేకాదు దీనిలో ఉండే యాంటిఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలను తక్షణమే నివారిస్తాయి.

చక్కెర చేసే మేలు:

నలుపుదనం పోవాలంటే మోచేతులు, మోకాళ్ల వద్ద కూడా చక్కెర చక్కగా పనిచేస్తుంది. దీని కోసం చక్కెర, ఆలివ్‌ ఆయిల్‌తో చేసిన‌ స్క్రబ్‌ కీలకంగా పనిచేస్తుంది. మృతకణాలను తొలగించడంలో చక్కెర సాయపడితే.. ఆలివ్‌ నూనె మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. అలాగే చక్కెరకు కాఫీ పొడి, కొబ్బరినూనె కలిపి ముఖం, మెడ, చేతులపై సున్నితంగా రుద్దుతూ మర్దనా చేసినా మంచి ఫలితం ఉంటుంది.

 

 

 

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×