E-Paper
Advertisement

Carrot Sweet Corn Omelette Recipe: బరువు తగ్గేందుకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ క్యారెట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్, రెసిపీ ఇదిగో

Carrot Sweet Corn Omelette Recipe: బరువు తగ్గేందుకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ క్యారెట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్, రెసిపీ ఇదిగో
Advertisement

ప్రతిరోజూ ఉదయం బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తో రోజును మొదలుపెట్టాలి. అప్పుడే మీరు రోజంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఇక్కడ మేము క్యారెట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్ రెసిపీ గురించి ఇచ్చాము. బరువు తగ్గాలనుకునేవారు, ఆరోగ్యకరమైన టిఫిన్ గురించి వెతికే వారు ఈ బ్రేక్ ఫాస్ట్ ఎంపిక చేసుకుంటే మంచిది. దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. దీని రెసిపీ కూడా చాలా సులువు.

క్యారెట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
క్యారెట్లు – రెండు
స్వీట్ కార్న్ గింజలు – అర కప్పు
గుడ్లు – రెండు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – నాలుగు
కొత్తిమీర తరగు – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – సరిపడినంత

Advertisement

క్యారెట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్ రెసిపీ
1. ముందుగా స్వీట్ కార్న్‌ గింజలను ఉడికించి పక్కన పెట్టండి.
2. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి పెట్టండి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించండి.
4. తర్వాత క్యారెట్ వేసి రెండు నిమిషాలు వేయించండి.
5. ఇప్పుడు ఉప్పు, కొత్తిమీర, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి బాగా కలపండి.
6. మరో గిన్నెలో గుడ్లను పగలగొట్టి బాగా గిలకరించండి.
7. ఇప్పుడు అదే కళాయిలో గుడ్ల మిశ్రమాన్ని పోయండి.
8. రెండు వైపులా ఆమ్లెట్ వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ క్యారెట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్ సిద్ధమైనట్టే.

ఈ ఆమ్లెట్ తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. దీనిలో మనం వాడిన క్యారెట్‌లో ఎక్కువగా విటమిన్ A ఉంటుంది. ఇది కళ్లకు చాలా మంచిది. ప్రతిరోజు క్యారెట్ తింటే చూపు బాగుంటుంది, కళ్ల సమస్యలు దూరమవుతాయి. అందుకే చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఆహారంలో చేర్చుకోవాలి.అలాగే క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. రోజూ ఒకటి రెండు క్యారెట్లు తినడం మంచిది. అలాగే క్యారెట్ జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇందులో మనం వాడిన గుడ్డు కూడా ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ప్రోటీన్, విటమిన్ D, విటమిన్ B12, ఇనుము, క్యాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుడ్డు తినడం వల్ల శరీరానికి శక్తి పెరుగుతుంది, కండరాలు బలపడతాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, అలాగే కళ్ల ఆరోగ్యానికి కూడా మంచిది. గుడ్డు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, చిన్నపిల్లల ఎదుగుదలకి ఉపయోగపడుతుంది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×