E-Paper
Advertisement

Doodh Soda: సిల్వర్ స్క్రీన్ నుంచి కిచెన్ వరకూ.. ధురంధర్‌తో హిట్ అయిన ‘దూద్ సోడా’ రెసిపీ ఇదే!

Doodh Soda: సిల్వర్ స్క్రీన్ నుంచి కిచెన్ వరకూ.. ధురంధర్‌తో హిట్ అయిన ‘దూద్ సోడా’ రెసిపీ ఇదే!
Advertisement

Doodh Soda: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్‌ సినిమాతో వైరల్ అయిన ‘దూద్ సోడా’ గురించే ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చర్చ. ఈ సినిమాలో గౌరవ్ గేరా, భారతీయ గూఢచారి పాత్రలో.. ‘మొహమ్మద్ ఆలం’ అనే సోడా విక్రేతగా కనిపిస్తారు. ‘డార్లింగ్ డార్లింగ్ దిల్ క్యూ తోడా.. పీలో పీలో ఆలం సోడా’ అంటూ ఆయన చెప్పే డైలాగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాంతో పాటు, ఈ పాత తరహా పానీయం మీద అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో దూద్ సోడా ఎందుకు అంత ఫేమస్, దాని మూలాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దూద్ సోడా అంటే..

దూద్ సోడా అనేది పాకిస్తాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన సంప్రదాయ పానీయం. ముఖ్యంగా లాహోర్, కరాచీ వంటి నగరాల్లో ఇది రోజూ తాగే రిఫ్రెషింగ్ డ్రింక్‌గా ప్రసిద్ధి. చల్లటి పాలు, సోడా, చక్కెర కలిపి దీన్ని తయారు చేస్తారు. రుచి కోసం కొందరు రోజ్ ఎసెన్స్, జాజికాయ పొడి లేదా ఏలకుల వంటి సువాసన ద్రవ్యాలను కూడా జోడిస్తారు. అక్కడి ఆహార సంస్కృతిలో ఇది ఒక నాస్టాల్జిక్ డ్రింక్‌గా గుర్తింపు పొందింది.

ఎలా తయారు చేస్తారు?

Advertisement

దూద్ సోడా తయారు చేసుకోవాలంటే.. ఓ మిక్సింగ్​ బౌల్‌లో రెండు స్పూన్ల గోంధ్ కతీరా, రుచికి సరిపడా పంచదారను కలిపి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో గోంద్ కతీరా, ఐస్ ముక్కలు, అలాగే గ్లాసుకు ఒక స్పూన్ చొప్పున రూ అఫ్జా క్రీమ్ వేసుకోవాలి. ఆ తర్వాత కాచి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని పాలు పోసుకుని కలపాలి. చివరగా సోడా నీళ్లు లేదా స్ప్రైట్ పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు సోడా నీళ్లకు బదులు స్ప్రైట్ పోసుకోవాలనుకుంటే పంచదార పొడి తగ్గించి తీసుకోవాలి. గ్లాసుల్లోకి తీసుకున్న తర్వాత పైన ఐస్​క్రీమ్​ లేదా గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్ మిక్స్ వేసుకుని తాగడమే.

తయారీకి కావల్సిన పదార్థాలివే:

గోంధ్ కతీరా – 2 స్పూన్ల
చక్కెర – 3 స్పూన్లు
ఐస్ ముక్కలు – కొన్ని
రూ అఫ్జా – గ్లాసుకో స్పూన్ చొప్పున
కాచి చల్లార్చిన చల్లని పాలు – అర లీటర్
సోడా – 250ఎం.ఎల్
స్ప్రైట్ – 250 ఎం.ఎల్
డ్రై ఫ్రూట్ మిక్స్ – కొద్దిగా

చరిత్రలోకి వెళ్తే..

Advertisement

బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ రాకముందు.. ఉమ్మడి పంజాబ్ ప్రాంతంలో దూద్ సోడాకు మంచి ఆదరణ ఉండేది. దీని మూలాలు బ్రిటిష్ కాలం వరకు వెళ్తాయి. విక్టోరియన్ ఇంగ్లాండ్‌లో మొదలైన ఈ పానీయం, బ్రిటిష్ సామ్రాజ్యం ద్వారా భారత ఉపఖండానికి చేరింది. 1947 విభజన తర్వాత పాకిస్తాన్‌లో ఇఫ్తార్ సమయంలో తాగే ముఖ్యమైన పానీయంగా మారింది. భారతదేశంలోనూ పంజాబ్, పాత ఢిల్లీ, అమృత్‌సర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ దీన్ని తయారు చేస్తుంటారు.

ఆరోగ్యానికి మంచిదేనా?

దూద్ సోడా తాగిన వెంటనే కొంతమందికి కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలగవచ్చు. సోడా కారణంగా అరుగుదల సమస్యలు, గుండెల్లో మంట వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లాక్టోస్ అసహనం ఉన్నవారు, IBS, ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఈ పానీయాన్ని దూరంగా ఉంచడమే మంచిదని సూచిస్తున్నారు. అలాగే, ఇందులో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల అధికంగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×